Peddireddy : మాజీ మంత్రి పెద్దిరెడ్డికి బిగ్ షాక్
AP: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మరో షాక్ తగిలింది. ఫైల్స్ దగ్ధం కేసును సీఐడీకి అప్పగించింది రాష్ట్ర సర్కార్. రెండు రోజుల్లో కేసుకు సంబంధించిన వివరాలను సీఐడీకి అప్పగించనున్నారు మదనపల్లె పోలీసులు. ఈ కేసులో పెద్దిరెడ్డి పీఏ, ఆయన అనుచరులు, మాజీ ఎమ్మెల్యే ఉన్న సంగతి తెలిసిందే.
AP News: సీఐడీ చేతికి మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసు!
ఏపీలోని మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దగ్దం కేసు సీఐడీకి అప్పగించినట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై ఇప్పటివరకు పలువురు ఉద్యోగులు, నాయకులపై 9 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
AP: మదనపల్లి ఘటనపై సర్కార్ సీరియస్.. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు..!
మదనపల్లె ఫైల్స్ దగ్ధం ఘటనపై సర్కార్ సీరియస్ అయింది. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేసింది. గత RDO మురళి, ప్రస్తుత RDOగా పని చేస్తున్న హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌ను సస్పెండ్ చేస్తూ రెవిన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.
AP: మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో కీలక మలుపు.. పోలీసుల అదుపులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు..!
మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు.. మదనపల్లె మున్సిపల్ వైస్ ఛైర్మన్ జింకావెంకట చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చలపతి నివాసంలో పోలీసులు పలు డాక్యుమెంట్లు తీసుకెళ్లినట్లు సమాచారం.
AP: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో తనిఖీలు..!
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కేసులో విచారణ వేగంగా కొనసాగుతంది. రాష్ట్ర రిజిస్ట్రేషన్ జాయింట్ ఐజీ సరోజా మదనపల్లె సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. పలు కీలక ఫైల్స్‌ను ఆమె పరిశీలిస్తున్నారు.
AP DGP: మదనపల్లె సబ్ కలెక్టరేట్ ను పరిశీలించిన డీజీపీ.. అగ్ని ప్రమాదంపై కీలక ప్రకటన!
మదనపల్లె ఆర్డీవో కార్యాలయాన్నిడీజీపీ ద్వారకా తిరుమల రావు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ ఘటన యాక్సిడెంట్ కాదని.. ఇన్సిడెంట్‌లా కనిపిస్తోంది.కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయి. ఆఫీసు బయట కూడా పలు ఫైల్స్ కాలిపోయినట్లు గుర్తించినట్లు డీజీపీ తెలిపారు.
AP: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బందిపై స్పెషల్ ఫోకస్.. వారి మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకుని..
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పూర్తి స్థాయి కార్యాలయ సిబ్బందిని SP విద్యా సాగర్ నాయుడు విచారిస్తున్నారు. అగ్నిప్రమాదం ఘటనకు ముందు, తరువాత కార్యాలయం లోకి వెళ్లిన సిబ్బందిని అధికారులు DSP కార్యాలయానికి తరలించారు. సిబ్బంది మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు.