/rtv/media/media_files/2025/11/03/madanapalle-1-2025-11-03-10-15-18.jpg)
రాత్రిపూట స్మశాన వాటిక వెళ్తారా... అంత దైర్యం చేస్తారా.. పోనీ ఆ ఆలోచన వచ్చిన చచ్చేంత భయం వేస్తుంది. అలాంటిది... అదే స్మశాన వాటికలో అప్పుడే పాతిపెట్టిన శవాన్ని బయటకు తీయాలంటే అమ్మా బాబోయ్..ఇక చచ్చినట్టే.. కానీ ఓ దుర్మార్గుడు.. అదే పని చాలా దైర్యంగా చేశాడు.. చివరకు దొరికిపోవడంతో స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణ శివార్లలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది.
అక్కడినుంచి పారిపోయేందుకు
మదనపల్లె శివార్లలో అంకిశెట్టిపల్లి మార్గంలో గల స్మశాన వాటికలో పాతిపెట్టిన ఓ శవాన్ని జైపూర్ కు చెందిల గోవింద్ అనే ఓ యువకుడు వెలికితీశాడు. పూర్తిగా మృతదేహాన్ని బయటకు తీస్తుండగా స్థానికులు గమనించారు.. ఓయ్ ఎవడ్రా నువ్వు అంటూ గట్టిగా కేకలు వేశారు. దీంతో గోవింద్ అక్కడినుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు స్థానికులు. అయితే జాదు చేసేందుకే తాను శవాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించానని గోవింద్ పోలీసులకు వెల్లడించాడు.
ఆ గ్రామంలో ఓ యువకుడు చనిపోగా.. స్థానికులు నిన్న అతని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అదే రోజు రాత్రి గోవింద్ ఆ శవాన్ని బయటకు తీయబోయాడు. అయితే మృతదేహానికి సంబంధించిన అవయవాలు అపహారించేందుకు ఇలా చేసి ఉంటాడని అనుమానించి స్థానికులు అతనికి దేహశుద్ధి చేశారు. అనంతరం తాలూకా పోలీసులకు అప్పగించారు.అతడి ప్రవర్తన, ఆకారం కూడా అనుమానాస్పదంగా ఉండటంతో, తాంత్రిక పూజలు చేసేందుకే దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Follow Us