TG Politics: అక్బరుద్దీన్ VS రేవంత్ రెడ్డి.. కులగణన సర్వేపై పేలిన మాటల తూటాలు!
తెలంగాణ కులగణన సర్వేపై అసెంబ్లీలో సీఎం రేవంత్, అక్బరుద్దీన్ ఓవైసీ మధ్య మాటల తూటాలు పేలాయి. కులగణన, సమగ్ర కుటుంబ సర్వేను అసెంబ్లీలో ఎందుకు చర్చకు పెట్టట్లేదంటూ అక్బరుద్దీన్ నిలదీశారు. దీంతో ప్రైవసీ వివరాలు బయటపెడితే లీగల్గా సమస్యలొస్తాయని సీఎం చెప్పారు.