విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఘోర ప్రమాదం!
హైదరాబాద్- విజయవాడ హైవేపై ఐతవరం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ లారీ కారును ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న చెవిటికట్లు టీడీపీ నేత కోగంటి విష్ణువర్ధన్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
Road Accident: కడప లో రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి!
ఖాజీపేట జాతీయ రహదారి దుంపల గట్టు టోల్ ప్లాజా సమీపంలో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం ...రెండు లారీలు ఢీ.. నలుగురు మృతి
తెలంగాణలోని మెదక్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు లారీలు ఢీకొట్టుకోవడంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద బైపాస్ రోడ్డు పై ఈ ప్రమాదం జరిగింది.
Andhra Pradesh : పుష్ప సీన్ రిపీట్.. లారీ కింద రూ.8 కోట్ల 40 లక్షలు సీజ్
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఇద్దరు దుండగులు లారీ కింద ఏర్పాటు చేసిన అరలో డబ్బులు తరలించేందుకు ప్రయత్నించారు. గరికపాడు చెక్‌పోస్టు వద్ద అర్ధరాత్రి పోలీసులు ఆ వాహనాన్ని పట్టుకున్నారు. అందులో తనిఖీ చేయగా.. మొత్తం 8 కోట్ల 40 లక్షల రూపాయలు సీజ్ చేశారు.
Breaking: ఘోర ప్రమాదం..పెళ్లి ఊరేగింపు పై పడిన ట్రక్కు.. 6 గురు మృతి!
రాడ్లతో కూడిన లారీ టైరు పేలడంతో పెళ్లి ఊరేగింపుతో వెళ్తున్న స్కార్పియోపై బోల్తా పడింది. హైవాలో స్కార్పియో లోడ్ లారీ కింద నలిగిపోవడంతో ఒక చిన్నారితో సహా ఆరుగురు అక్కడికక్కడే మరణించారు
Andhra Pradesh: అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు మృతి
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆటో ఢీ కొని నలుగురు యువకులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Nellore:నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ.
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి టోల్ ప్లాజా దగ్గర ఓ ప్రవైట్ బస్సును లారీ ఢీకొట్టింది. ఇందులో ఏడుగురు మృతి చెందగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Crime: పండగపూట విషాదం.. వాకిట్లో ముగ్గేస్తున్న టీడీపీనేత కూతుళ్లపైకి దూసుకెళ్లిన లారీ
పండగపూట ఏపీలో ఘోరం జరిగింది. ఏలూరు జిల్లా కానుకొల్లుకు చెందిన టీడీపీ నేత పంగిళ్ల నాగబాబు కూతుళ్లు వాకిట్లో ముగ్గులేస్తుండగా ఇటుకలారీ వారిపైకి దూసుకెళ్లింది. పెద్దమ్మాయి తేజస్విని అక్కడికక్కడే చనిపోగా.. చిన్నమ్మాయి పల్లవి దుర్గా చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.