Nara Lokesh: నేను జగన్ రెడ్డి బాధితుడినే.. లోకేష్ ఫైర్!
AP: గత ఐదేళ్లలో రాష్ట్ర నాశనం అయిందని అన్నారు లోకేష్. తాను కూడా జగన్ బాధితుడిని చెప్పారు. పాదయాత్రలో మాట్లాడుతుంటే తన స్టూల్, మైక్ లాగేశారని మండిపడ్డారు. అడుగడుగునా ఇబ్బంది పెట్టారని చెప్పారు. వారికి సినిమా చూపిస్తా అని వార్నింగ్ ఇచ్చారు.
వైసీపీ అంటేనే ఫేక్.. లోకేష్ ఫైర్!
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నారని వైసీపీ ఎంపీ గురుమూర్తి చేసిన ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చారు లోకేష్. వైసీపీ అధ్యక్షుడు నుంచి కార్యకర్త వరకు అందరు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను తమ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.
Andhra Pradesh: వారికి వెంటనే జీతాలు చెల్లించాలి.. లోకేష్ కీలక ఆదేశాలు
వచ్చే విద్యాసంవత్సరం మొదలయ్యే నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సిద్ధంగా ఉంచాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో ఆయాలు, వాచ్మెన్లకు పెండింగ్‌లో ఉన్న జీతాలను తక్షణమే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
Lokesh: నాడు నేడుపై విచారణ జరుపుతాం: మంత్రి లోకేష్
AP: అసెంబ్లీలో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రెండు విడతల్లో చేసిన నాడు-నేడు పనుల్లో మొత్తం అవినీతి జరిగిందని అన్నారు. నాడు-నేడు పై విచారణ జరుపుతాం అని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను మారుస్తాం అని చెప్పారు.
Lokesh: గంగానమ్మ తల్లి ఆలయంలో మంత్రి లోకేష్ దంపతుల పూజలు
AP: తాడేపల్లిలోని గంగానమ్మ తల్లి ఆలయ పునఃనిర్మాణ ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. అమ్మవారికి చీర సమర్పించారు లోకేష్, బ్రాహ్మణి. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని పూజలు నిర్వహించారు.
Andhra Pradesh: విద్యార్ధులకు సర్టిఫికేట్లు..మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలతో సర్టిఫికేట్లు అందక బాధపడుతున్న విద్యార్ధుల విషయంలో ఆంద్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. అందరికీ సర్టిఫికేట్లు అందజేయాలని అధికారులకు చెప్పారు. దీని వలన 6 లక్షల మంది స్టూడెంట్స్‌కు పర్టిఫికేట్లు అందనున్నాయి.
AP: మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేసిన మంత్రి లోకేష్!
ఏపీ మంత్రి నారా లోకేష్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల మంత్రిగా లోకేష్ సోమవారం బాధ్యతలను చేపట్టారు.ఆయన కొన్ని పైళ్ల మీద సంతకం చేశారు. అధికారులు, తెలుగుదేశం పార్టీ నేతలు లోకేష్ కి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
Breaking: ఎమ్మెల్యేలుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారం
ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు.