Google:జీతాల పెంపు పై ఉద్యోగుల ఆశలన్నీ ఆవిరే!
గూగుల్ లో పని చేసే ఉద్యోగులు జీతాల పెంపు పై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఉద్యోగులు అనుకున్న స్థాయిలో ఈ సంవత్సరం జీతాల పెంపు లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.
గూగుల్ లో పని చేసే ఉద్యోగులు జీతాల పెంపు పై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఉద్యోగులు అనుకున్న స్థాయిలో ఈ సంవత్సరం జీతాల పెంపు లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.
విమానంలో ప్రయాణిస్తున్న ఓ యువకుడు.. తన పక్కన కూర్చున్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ముఖ్యంగా ఇద్దరు స్త్రీలను చూస్తూ.. హస్త ప్రయోగం చేసుకున్నాడు. దీంతో భయపడిన మహిళలు విమాన సిబ్బందికి తెలియజేశారు.దీంతో విమానం దిగగానే అతనిని అరెస్ట్ చేశారు.
గ్రీన్ ల్యాండ్ ను అమెరికాలో విలీనం చేసుకోవాలన్న ట్రంప్ ప్రణాళికలతో తమకుఏ సంబంధం లేదని రష్యాఅధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.కాకపోతే ఈ విషయంలో మాత్రం అమెరికా చాలా సీరియస్ ప్లాన్లు వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ట్రంప్ సుంకాలు అన్యాయమైనవని కెనడా ప్రధాని మార్క్ కార్నీ అన్నారు.వాహన దిగుమతుల పైనా 25 శాతం సుంకాన్ని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో ఇరుదేశాల మధ్య ఉన్న పాత బంధం ముగిసిపోయిందని కార్నీ అన్నారు.
ఫెడరల్ ఉద్యోగుల పనితీరు గురించి నివేదిక కోరుతూ గత నెలలో మస్క్ పంపిన మెయిల్ తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ విధేయులను ఫెడరల్ HR ఏజెన్సీలో తాజాగా నియమించారు.
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ముగించేందుకు అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్నాయి.ఈ పరిణామాల వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.జెలెన్ స్కీ ప్రభుత్వం మారితే యుద్ధాన్ని ఆపేస్తామని ప్రకటించారు.
ఏపీలో ఎండ, వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. ప్రకాశం జిల్లాలో 42.4, నెల్లూరు జిల్లాలో 42.2, కడప జిల్లాలో 42.1 డిగీ్రల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం తో పాటు 89 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని అధికారులు తెలిపారు.
ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొన్ని కొత్త రూల్స్ రానున్నాయి. ఆదాయపు పన్ను, క్రెడిట్ కార్డు, టీడీఎస్, టీసీఎస్, యూపీఐ సర్వీసులకు సంబంధించిన వాటిలో నిబంధనలు మారనున్నాయి. ఇవన్నీ కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి.