Karnataka: గుండెపోటుతో మూడో తరగతి విద్యార్థిని మృతి
కర్ణాటకలో మూడో తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలిక గుండె పోటుతో మరణించింది. ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న బాలిక గుండె పోటుతో అకస్మాత్తుగా కుప్పకూలింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే మృతి చెందింది. చిన్నారి మరణించడంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు.