/rtv/media/media_files/2025/01/24/5DLDKySi1uB4CdGrq15l.jpg)
Uttar Pradesh woman Priyanka found dead in bathtub Thailand
UP Woman Death: అతిలోక సుందరిగా నటి శ్రీదేవి ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. కానీ ఆమె మరణం అందరినీ కలచివేసింది. దుబాయిలో జరిగిన వేడుకకు హాజరైన శ్రీదేవి.. అక్కడ మృతి చెందింది. ఒక హోటల్ గదిలో స్నానం చేసే నీటి తొట్టెలో విగతజీవిగా తేలి సినీ ప్రేక్షకులకు, అభిమానులకు తీరని శోకం మిగిల్చింది. ఆమె మరణంపై అప్పట్లో ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి జరిగింది.
Also Read : భర్తతో విడిపోతున్న మరో హీరోయిన్.. ఫొటోలు డిలీట్!
2017లో ప్రేమ వివాహం
లక్నోలోని ఎల్డెకో సౌభాగ్యం బృందావన్ యోజనకు చెందిన డాక్టర్ ఆశిష్ - సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ప్రియాంక జంట 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే తమ కొడుకుతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం లక్నో నుంచి థాయిలాండ్‌కు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఓ హోటల్‌లో బస చేశారు.
అక్కడ నుంచి తరచూ విహారయాత్రలు, పార్టీలకు వెళ్లారు. అయితే జనవరి 7వ తేదీ రాత్రి పార్టీ ముగించుకుని 2 గంటల ప్రాంతంలో తిరిగి తమ హోటల్ రూమ్‌కు చేరుకున్నారు. అనంతరం ప్రియాంక స్నానం చేసేందుకు బాత్‌రూమ్‌కు వెళ్లింది. ఇంతలో కొడుకు ఆకలిగా ఉండడంతో జ్యూస్ ఇద్దామని ఆశిష్ గదిలోంచి బయటకు తీసుకెళ్లాడు.
బాత్ టబ్‌లో విగతజీవిగా
Also Read : నాలుగో రోజు కంటిన్యూ .. దిల్ రాజు ఇళ్లల్లో కొనసాగుతున్న ఐటీ దాడులు
ఆపై తిరిగి గదిలోకి వెళ్లి బాత్‌రూమ్‌లో స్నానం చేస్తున్న ప్రియాంకను పిలిచినా ఆమె స్పందించకపోవడంతో ఆశిష్ హోటల్ సిబ్బంది సహాయం కోరాడు. దీంతో వారు వచ్చి డోర్ ఓపెన్ చేయగా.. ప్రియాంక బాత్ టబ్‌లో విగతజీవిగా పడి ఉంది. ప్రియాంకను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
దీంతో ఇది అనుమానాస్పద మృతి కావడంతో థాయ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రియాంక మృతి చెందిన వెంటనే థాయ్‌లాండ్‌లో ఆమె మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. కానీ ఆమె మృతిలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు తెలిపారు. ఇక ఆ మృతదేహానికి లక్నోలో మరోసారి పోస్ట్ మార్టం నిర్వహించారు.
Also Read : ఆస్కార్‌కి ప్రియాంక చోప్రా ‘అనూజ’ షార్ట్ ఫిల్మ్ నామినేట్!
వెలుగులోకి కొత్త విషయం
ఇందులో వెలుగులోకి వచ్చిన కొత్త విషయం అనుమానాలకు తావిస్తోంది. మరణానికి ముందు శరీరంపై గాయం గుర్తులు ఉన్నట్లు షాకింగ్ విషయం బయటకొచ్చింది. లక్నోలో నిర్వహించిన పోస్టుమార్టంలో ప్రియాంక మృతదేహంపై ఏకంగా తొమ్మిది యాంటీ మార్టం గాయాలు కనిపించాయి. తల వెనుక, భుజం, కుడిచేతి మోచేయి, ఎడమ చేయి, వీపు బయటి భాగంలో గాయాలు ఉన్నాయని తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంక శరీరంపై గాయాలు ఎలా కనిపించాయన్నది ఇప్పుడు ప్రశ్న.
భర్త హత్యేనని ఆరోపణలు
ప్రియాంక మృతికి సంబంధించి ఆమె భర్త ఆశిష్ తమ కుమార్తెను హత్య చేశాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ అల్లుడు ఆశిష్ ప్రవర్తన ప్రియాంక పట్ల చాలా అసభ్యంగా ఉండేదని వారు చెబుతున్నారు. ప్రియాంక తన కొడుకుకు జన్మనిచ్చిన వెంటనే ఆశిష్ ప్రియాంకతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడని అంటున్నారు. ఒకసారి ఆశిష్ ప్రియాంకను బాగా కొట్టడంతో ఆమె చేయి విరిగిపోయిందని అన్నారు. ఆశిష్‌కి వేరే అమ్మాయితో సంబంధం ఉందని, దాని కారణంగానే ఆశిష్ తరచూ తమ కూతురిని ఇబ్బంది పెడుతుండేవాడని ప్రియాంక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Also Read : నీయవ్వ తగ్గేదేలే.. జాన్వీ కపూర్‌కు దేవిశ్రీ ప్రసాద్ బంపరాఫర్!
కేసు నమోదు
ఈ ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య లక్నోలో నిర్వహించిన పోస్టుమార్టంలో వెల్లడైన వాస్తవాలు వ్యవహారాన్ని మరింత క్లిష్టతరం చేశాయి. ఈ విషయాలన్నీ ప్రియాంక కుటుంబ సభ్యులకు అనుమానాన్ని పెంచాయి. ఈ విషయంలో లక్నోలోని PGI పోలీస్ స్టేషన్‌లో తమ అల్లుడు ఆశిష్ శ్రీవాస్తవపై హత్య కేసు పెట్టారు. ప్రస్తుతం ప్రియాంక మృతికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.
ఏదైనా మత్తు మందు ఇచ్చారా?
ప్రియాంక బాత్‌టబ్‌లో మునిగిపోయే ముందు ఆమెకు ఏదైనా మత్తు లేదా విషపూరితమైన పదార్థాన్ని ఇచ్చారా?, దాని కారణంగా ఆమె తనపై నియంత్రణ కోల్పోయి బాత్‌టబ్‌లోనే మునిగిపోయిందా?లేదా ఈ మరణం కేవలం ప్రమాదమా?అని తెలుసుకోవడానికి పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు.