Srisailam: శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం వెళ్లిన తెలంగాణ వ్యక్తి.. ఇంతలోనే..
శ్రీశైలం డ్యాం వద్ద స్నానానికి వెళ్లిన తెలంగాణ వ్యక్తి గల్లంతైయ్యాడు. నల్లగొండ జిల్లా వెంకటాపురానికి చెందిన చొప్పరి యాదయ్య తోటి స్నేహితులతో కలిసి శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం వెళ్లారు. డ్యాం వద్ద స్నానానికి వెళ్లిన యాదయ్య నీటిలో కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు.