Kota Srinivasa Rao: కోటపై ఎన్టీఆర్ అభిమానులు దాడి.. విజయవాడ రైల్వేస్టేషన్లో!
కోట శ్రీనివాసరావు కెరీర్లో ఒక వివాదాస్పద చిత్రం మండలాధీశుడు. ఈ చిత్రంలో ఆయన నటించిన ఒక పాత్ర అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావుగారిని వ్యంగ్యంగా అనుకరించేలా ఉంటుందని భావించారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.