Vande Bharat: తెలంగాణకు మరో వందే భారత్…ఆ రూట్లో పరుగులు!
తెలంగాణ గడ్డ నుంచి మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు పరుగులు పెట్టేందుకు సిద్దంగా ఉంది. సికింద్రాబాద్ -నాగ్పూర్ స్టేషన్ల మధ్య ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్ పరుగులు పెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15న ప్రధాని మోదీ వందే భారత్ రైలును వర్చువల్ గా ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణ నుంచి వివిధ రాష్ట్రాల మధ్య నాలుగు వందే భారత్ రైళ్లు సేవలందిస్తుండగా…ఐదో రైలు ఈ నెల 15 నుంచి పరుగులు పెట్టబోతోందన్నారు. ఈ ఎక్స్ప్రెస్ రైలు రెండు నగరాల మధ్య 578 కిలో మీటర్ల దూరాన్ని కేవలం ఏడు గంటల 15 నిమిషాల్లోనే పూర్తి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. సికింద్రాబాద్ -నాగ్పూర్ స్టేషన్ల మధ్య మరో వందేభారత్ రైలు పరుగులు పెట్టేందుకు రెడీ అవుతుంది. ఈ నెల 15న ప్రధాని మోదీ వందే భారత్ రైలును వర్చువల్ గా ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.
Kishan Reddy: వరద ప్రభావిత ప్రాంతల్లో కిషన్ రెడ్డి, భట్టి పర్యటన
TG: ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భట్టి విక్రమార్క. వరద బాధితులను కేంద్రం తప్పకుండా ఆదుకుంటుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక రాగానే నిధులు విడుదల చేస్తామన్నారు.
Telangana:అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే బడ్జెట్ - కిషన్ రెడ్డి
ఆత్మనిర్భర భారత్ నిర్మాణమే లక్ష్యంగా కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై మాట్లాడిన ఆయన దేశీయ ఉత్పత్తిని పెంపొందించడానికి, మధ్య, ఎగువ మధ్య తరగతి వారికి పన్ను ఆదా ప్రకటించిందని తెలిపారు.
Telangana: పైరవీకారులకే సచివాలయ ఎంట్రీ- కేంద్రమంత్రి కిషన్రెడ్డి
డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ నిలువునా మోసం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం పోయి, సోనియా కుటుంబం వచ్చిందని..దీన్నే మార్పు అంటారా అంటూ ఆయన తెలంగాణ ప్రభుత్వం మీద మండిపడ్డారు. 8 నెలల్లోనే రేవంత్ సర్కార్ వంచనకు గురిచేస్తోందని ఆయన విమర్శించారు.
Telangana: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడింది. ఇప్పటికిప్పుడే అధ్యక్ష మార్పు వద్దని అధిష్ఠానం భావిస్తోంది. మరో 2 నెలల తర్వాతే బీజేపీ నూతన అధ్యక్షుడి నియామించాలని నిర్ణయించుకుంది.
Telugu MP's: పంచెకట్టుతో పార్లమెంటుకు ఎంపీలు, తెలుగులో ప్రమాణం
ఢిల్లీలో 18వ లోక్ సభ కొలువుతీరింది. మదటి రోజు ప్రధాని మోదీతో పలువురు మంత్రులు ప్రమాణం చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డి, టీడీపీ ఎంపీ అప్పలనాయుడు లోక్సభకు పంచెకట్టుకు హాజరవ్వడమే కాక తెలుగులో ప్రమాణం చేశారు.
Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఇంటి దగ్గర హై టెన్షన్
TG: కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది. NEET పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, యువజన విద్యార్థి సంఘాల నేతలు కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Jammu kashmir: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు.. కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలు!
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ అధిష్టానం మరో కీలక బాధ్యతలు అప్పగించింది. మరో రెండు నెలల్లో జమ్మూకశ్మీర్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ఇంఛార్జిగా కిషన్ రెడ్డిని నియమించింది. మరిన్ని రాష్ట్రాలకు ఇంఛార్జిలను నియమిస్తూ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.
/rtv/media/media_library/7a363983ff9b869a7dc3a2fcd9ce6f9b0a2452c3176faec627cfed37dfa1dc62.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/vandebharat-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/KISHAN-REDDY.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-116.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-10-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-01-at-5.56.08-PM.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-11-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Kishan-Reddy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-17-6.jpg)