పాక్ ఆర్మీపై సొంత దేశ ప్రజల తిరుగుబాటు.. వాళ్ల టార్గెట్ ఇదే!

ఖైబర్ పఖ్తుంక్వాలోని ఓ గ్రామంపై పాకిస్తాన్ సైన్యం బాంబుల వర్షం కురిపించింది. పాకిస్తాన్ ఆర్మీ బాంబు దాడుల్లో 30 మందికిపైగా పౌరుల మృతి చెందారు. ఈ ఘటనతో ఖైబర్ ఫఖ్తుంక్వాలో ప్రజలు అట్టుడికిపోతున్నారు. పాక్ ఆర్మీపై స్థానికులు తిరుగుబాటు చేయాలనుకుంటున్నారు.

New Update
images (13)

పాకిస్తాన్‌లో సైన్యంపై  ప్రజల తిరుగుబాటు మొదలైంది. ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున ఖైబర్ పఖ్తుంక్వాలోని ఓ గ్రామంపై పాకిస్తాన్ సైన్యం బాంబుల వర్షం కురిపించింది. పాకిస్తాన్ ఆర్మీ బాంబు దాడుల్లో 30 మందికిపైగా పౌరుల మృతి చెందారు. ఈ ఘటనతో ఖైబర్ ఫఖ్తుంక్వాలో ప్రజలు అట్టుడికిపోతున్నారు.

దీంతో పాకిస్తాన్‌ ఆర్మీపై స్థానికుల తిరుగుబాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పష్తున్ తెగ ప్రజలు భారీ ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. పాకిస్తాన్ సైన్యంపై తిరుగుబాటు చేయనున్నట్లు తెలుస్తోంది. పెషావర్‌లోని ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌ను ముట్టడించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు