ఖతార్ రాజుకు ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికిన ప్రధాని మోదీ

ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీ విమానాశ్రయంలో స్వాగతించారు. 2రోజుల పర్యటనలో భాగంగా ఆయన సోమవారం ఇండియాకు చేరుకున్నారు. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని మోదీతో ఆయన చర్చలు జరపనున్నారు.

New Update
kharar king to india

kharar king to india Photograph: (kharar king to india)

ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీ విమానాశ్రయంలో స్వాగతించారు. ఖతార్ దేశ రాజు రెండు రోజు భారత పర్యటన కోసం ఈరోజు సాయంత్రం స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి చేరుకున్నారు. మోదీ ఆహ్వానం మేరకు షేక్ తమీమ్ బిన్ మహద్ అల్ ఇండియాకు వచ్చారు.

Also Read: రైల్వే స్టేషన్‌తో తొక్కిసలాట.. బిడ్డను ఎత్తుకొని డ్యూటీ చేసిన మహిళా కానిస్టేబుల్

2015 మార్చిలో మోదీ ప్రభుత్వం హాయాంలోనే ఆయన మొదటి సారి ఇండియా విజిట్ చేశారు. ఆయన రెండవ సారి భారత్‌కు వచ్చిన సందర్భంగా స్వయంగా మోదీనే ఎయిర్ పోర్ట్‌కు వెళ్లి స్వాగతం పలికారు. ఖతార్ ఎమిర్ 
మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. ప్రధాని మోదీతో చర్చలు జరపనున్నారు.

Also Read: ఇండియా బ్యాన్ చేసిన చైనా డ్రోన్ ఎగరేసిన రాహుల్ గాంధీ.. చివరికి ఏమైందంటే..?

ఇండియా, ఖతార్ మధ్య అనేక దౌత్య సంబంధాలు ఉన్నాయి. గతకొంత కాలంగా వ్యాపారం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతికత వంటి రంగాలతో సహా రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. ఈక్రమంలో మరికొన్ని ఖతార్ దేశంలో ఒప్పందాలు ఈసారి చర్చలో జరిగే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు