Fire Accident: తెలంగాణలో ఘోర అగ్ని ప్రమాదం.. 400 పత్తి బస్తాలు దగ్ధం
బుధవారం రాత్రి ఖమ్మం పత్తి మార్కె్ట్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మార్కెట్ గోడౌన్లో నిల్వఉంచిన 400 పత్తి బస్తాలు మంటల్లో దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Khammam: కిడ్నాప్ కేసు విషాదాంతం.. శవమై తేలిన సంజయ్, గ్రామస్థుల ఆందోళన
ఖమ్మం యువకుడి కిడ్నాప్ కేసు విషాదాంతమైంది. పోలెపల్లికి చెందిన సంజయ్‌ను దుండగులు చంపేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ కుటుంబసభ్యులు, స్నేహితులు ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు.
Khammam: అన్నా నన్ను చంపేస్తున్నారు.. ఖమ్మంలో యువకుడి కిడ్నాప్ కలకలం!
పండగపూట ఖమ్మంలో ఓ సంచలన ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి వస్తున్న అన్న సాయిని రిసీవ్ చేసుకునేందుకు వెళ్లిన పోలెపల్లి యువకుడు సంజయ్ కిడ్నాప్‌కు గురికావడం సంచలనం రేపుతోంది. 'అన్నా నన్ను చంపేస్తారు కాపాడండి'అని సంజయ్ పంపిన వాయిస్ మెసేజ్ ఉత్కంఠ రేపుతోంది.
TG Accident: సూర్యాపేట హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
ఖమ్మం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది.
Khammam: ఖమ్మంలో కసాయి కోడలు.. మామను ఎలా చంపిందంటే?
సొంత మామనే కోడలు చంపేసిన ఘటన ఖమ్మంలో జరిగింది. అస్తమానం బయటకు తిరగవద్దని మామ మందలించడంతో కోడలు కక్ష పెంచుకుంది. సమయం చూసి ఓ రోజు నిద్రపోతున్న మామపై వేడి నూనె పోసింది. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మరణించాడు.
Khammam: ఎలుకల నిలయాలుగా గురుకులాలు.. విద్యార్థిని పరిస్థితి విషమం
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశాయి. రాత్రి నిద్రించే సమయంలో ఎలుకలు కరవడంతో ఓ విద్యార్థిని గాయపడింది. ఎలుకల దాడిలో నరాలు చచ్చుబడి విద్యార్థిని స్పర్శ కోల్పోయిందని భవాని కీర్తి తల్లి ఆరోపిస్తుంది.
విషాదం.. యువ రైతు ప్రాణం తీసిన అప్పులు
అప్పులు తీర్చలేక ఓ యువ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. వ్యవసాయం కోసం ట్రాక్టర్ తీసుకోవడం, కుటుంబ ఖర్చులతో అప్పు పెరిగిపోయింది. దీంతో అప్పు తీర్చలేనని ఆవేదన చెంది యువ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
Maoists: ఏజెన్సీలో హైటెన్షన్.. ఓ వైపు వారోత్సవాలు.. మరోవైపు కూంబింగ్!
నిన్న జరిగిన భారీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఏజెన్సీలో హై అలర్ట్ వాతావరణం నెలకొంది. ఓ వైపు మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతుంటే.. మరోవైపు పోలీసు బలగాలు భారీ కుంబింగ్ నిర్వహిస్తున్నాయి. హిట్ లిస్టులో ఉన్న నేతలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.