కార్తీక మాసంలో ఈ పనులు చేస్తే.. దరిద్ర మంతా మీ ఇంట్లోనే..

హిందువులకు పవిత్రమైన కార్తీకమాసంలో మాంసం, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి, గుమ్మడి కాయ, నువ్వులు, పెసరపప్పు, శనగ పప్పు, జీలకర్ర, కాకరకాయ, వంకాయ వంటి పదార్థాలు అసలు తినకూడదు. అలాగే ఇతరుపై కోపం, ఈర్షతో ఉంటే మీ ఇంట్లో దరిద్రం తిష్ట వేస్తుందట.

New Update
Karthikamasam: కార్తీక మాసం ఆఖరి రోజు..ఇలా చేస్తే ఆ దోషాలు పరార్‌!

హిందువులకు కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఈ మాసం శివుడికి చాలా ప్రీతిపాత్రమైనది. భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తారు. ఏడాది మొత్తం పూజలు చేస్తే ఎంత ప్రతిఫలం లభిస్తుందో.. కేవలం ఈ ఒక్క నెలలో పూజలు చేస్తే అంత ప్రతిఫలం వస్తుందని భక్తులు నమ్ముతారు.

ఇది కూడా చదవండి: పొంగులేటికి షాక్ ఇచ్చిన సీనియర్లు.. ఆ అంశాలపై హైకమాండ్ కు ఫిర్యాదు! 

నియమాలు పాటిస్తూ భక్తితో పూజిస్తే..

ముఖ్యంగా ఈ నెలలో దీపారాధన చేసి శివుడిని నియమనిష్టతో పూజ చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. కోరిక కోరికలు నెరవేరి అంతా మంచి జరగాలంటే కార్తీక మాసంలో కొన్ని పనులు చేయకూడదు. కొందరు తెలిసో తెలియక కొన్ని పనులు చేయడం వల్ల ఎక్కడలేని దరిద్రమంతా కూడా వారి ఇంట్లోనే ఉండిపోతుంది. 

ఇది కూడా చదవండి: సమీపిస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. ఎంతమంది బరిలో ఉన్నారంటే

కార్తీక మాసంలో ముఖ్యంగా చేయకూడని పనుల్లో ఒకటి మాంసాహారం తినకపోవడం. నెల రోజుల పాటు అసలు మంసాహారం జోలికి వెళ్లకూడదు. అలాగే మద్యపానం, ధూమపానం కూడా సేవించకూడదు. కార్తీకంలో ఈ పనులు చేయడం వల్ల శివుడు ఆగ్రహిస్తాడు. కార్తీకంలో శరీరానికి లేదా తలకు అసలు నూనె రాయకూడదు. 

ఇది కూడా చదవండి: మేమంతా ఒకే పిడికిలి.. రిటెన్షన్‌ పై హార్దిక్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కార్తీక మాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి, గుమ్మడి కాయ, నువ్వులు, పెసరపప్పు, శనగ పప్పు, జీలకర్ర, కాకరకాయ, వంకాయ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ఇతరులపై కోపగించుకోవడం, ఈర్షతో ఉండకూడదు. అలాగే ఈ మాసంలో ఆలస్యంగా నిద్ర లేవకూడదు. ఉదయం తొందరగా నిద్రలేచి శివుడిని పూజించాలని పండితులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి: త్వరలోనే పాదయాత్ర.. కేటీఆర్ సంచలన ప్రకటన!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పండితులను సంప్రదించి సూచనలు తీసుకోవడం ఉత్తమం. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు