కార్తీక పౌర్ణమి రోజు ఈ తప్పులు చేశారో.. దరిద్రమంతా మీ ఇంట్లోనే! కార్తీక పౌర్ణమి రోజు ఆహారం, ధాన్యాలు వంటివి దానం చేస్తే మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెండి, పాలు వంటి పదార్థాలను దానం చేయకూడదని, చేస్తే ఇంట్లోనే దరిద్రమంతా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. By Kusuma 13 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి హిందువులకు కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఈ మాసం శివుడికి చాలా ప్రీతిపాత్రమైనది. భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తారు. ఏడాది మొత్తం పూజలు చేస్తే ఎంత ప్రతిఫలం లభిస్తుందో.. కేవలం ఈ ఒక్క నెలలో పూజలు చేస్తే అంత ప్రతిఫలం వస్తుందని భక్తులు నమ్ముతారు. అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు చాలా మంది భక్తితో శివుడిని పూజిస్తారు. ముఖ్యంగా కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే కార్తీక పౌర్ణమి రోజు తెలియక కొన్ని తప్పులు చేస్తే మీ జీవితమంతా దరిద్రంలోనే ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇది కూడా చూడండి: 10th విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇకపై! కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించి.. కార్తీక పౌర్ణమి రోజు ఆలస్యంగా నిద్రలేవకుండా వేకువ జామున నిద్రలేవాలని పండితులు సూచిస్తున్నారు. ఉదయాన్నే లేచి దామోదర పూజ ఆచరించి నదిలో దీపాలు వదలాలి. అలాగే భక్తితో శివుడిని, విష్ణుమూర్తిని పూజించాలి. ఈ రోజు ఉపవాసం ఉండి కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించాలి. అయితే కార్తీక పౌర్ణమి రోజు కొన్ని వస్తువులు దానం చేయాలి. కానీ కొందరికి తెలియక వెండి పాత్రలు, పాలను దానం చేస్తుంటారు. వీటిని దానం చేయడం వల్ల మంచి కాకుండా చెడు జరుగుతుందని పండితులు అంటున్నారు. ఇది కూడా చూడండి: పొలిటికల్ పవర్ లిస్ట్‌లో టాప్-5లో ఉన్న రాజకీయ నాయకులు వీళ్లే! కార్తీక పౌర్ణమి రోజు మాంసాహారం, మద్యపానం, ధూమపానం వంటివి సేవించకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే ఇంట్లోనే దరిద్రమంతా ఉంటుదట. కార్తీక పౌర్ణమి రోజు పేదలకు ఆహారం, ధాన్యాలు వంటివి దానం చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఇది కూడా చూడండి: AP Rains: ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో వానలే..వానలు! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఈ నియమాలు పాటించే ముందు పండితులను సంప్రదించడం మేలు. ఇది కూడా చూడండి: Pawan Kalyan: పవన్ కు మరో కీలక బాధ్యత అప్పగించిన మోదీ! #lord-shiva #karthikamasam #lakshmi devi puja #moon మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి