Kakatiya : కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. పోలీసులు, విద్యార్థి నేతలకు మధ్య తీవ్ర తోపులాట.!
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ ప్రభుత్వ చిహ్నంలో కాకతీయ కళాతోరణం తొలగింపునకు నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనానికి బీఆర్ఎస్వీ నాయకులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థి నేతలకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది.