15 శాతం వాటా ఇవ్వాల్సిందే.. మాజీ ఎమ్మెల్యే జేసీ సంచలన వ్యాఖ్యలు
తాడిపత్రి నియోజకవర్గం అభివృద్ధికి మద్యం షాపు నిర్వాహకులు 15 శాతం వాటా ఇవ్వాల్సిందేనని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా ఆదేశాలు జారీ చేశారు. వ్యాపారం చేసేవారు 15 శాతం ఇస్తే.. తాను 20 శాతం ఇచ్చి తాడిపత్రిని అభివృద్ధి చేస్తానన్నారు.