YS Vijayamm-JC Prabhakar Reddy: విజయమ్మను అందుకే కలిశా.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి!

విజయమ్మతో భేటీపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో అనుకోకుండా విజయమ్మను కలిశానన్నారు. బాగోగుల గురించి పలకరించి మాట్లాడానన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రత్యేకత లేదన్నారు జేసీ. ఈ మేరకు ఆయన తన X ఖాతాలో పోస్ట్ చేశారు.

New Update
YS Vijayamm-JC Prabhakar Reddy: విజయమ్మను అందుకే కలిశా.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి!

JC Prabhakar Reddy Meets Ys Vijayamma: వైఎస్ విజయమ్మతో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారన్న వార్త సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ లోని విజయమ్మ ఇంటికి వెళ్లి ఆమెను కలిశారని మొదట వార్తలు వచ్చాయి. దీంతో జేసీ విజయమ్మ ఇంటికి ఎందుకు వెళ్లారు?, ఏమైనా రాజకీయ అంశాలను చర్చించారా? అన్న అంశంపై జోరుగా విశ్లేషణలు సాగాయి.
AP Govt Employees: ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. 8 శాతం పెంపు!

ఈ అంశంపై జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా రియాక్ట్ అయ్యారు. ఈ రోజు తాను హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లానని చెప్పారు. అక్కడ వెయిటింగ్ లాంజ్ లో వైఎస్ విజయమ్మ కనిపించడంతో.. బాగోగుల గురించి పలకరించి మాట్లాడినట్లు చెప్పారు. ఈ కలయిక లో ఎలాంటి రాజకీయ ప్రత్యేకత లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో పోస్ట్ చేశారు.

తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దపప్పూరు మండలం చీమలవాగుపల్లి విజయమ్మ స్వగ్రామం. దీంతో అదే ప్రాంతానికి చెందిన జేసీ ఫ్యామిలీతో విజయమ్మకు బంధుత్వం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలోనే చాలా రోజుల తర్వాత కనిపించిన విజయమ్మ వద్దకు జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లి పలకరించిన, యోగక్షేమాలు అడిగినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: AP Politics: చంద్రబాబు యాక్షన్ స్టార్ట్.. నెక్ట్స్ అరెస్ట్ అయ్యే వైసీపీ నేతలు వారేనా?


Advertisment
తాజా కథనాలు