JC Prabhakar : తాడిపత్రిలో సొంత పార్టీ నేతలకు జేసీ వార్నింగ్..!

తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణా చేస్తోన్న సొంత పార్టీ నేతలకు జేసీ ప్రభాకర్‌ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అక్రమ ఇసుక రవాణా చేసే వారందరూ ఆప్తులేనని.. దయచేసి వెంటనే ఆ పనులు ఆపేయాలని హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా చేసి తనకు దూరం కావొద్దని వేడుకున్నారు.

New Update
JC Prabhakar : తాడిపత్రిలో సొంత పార్టీ నేతలకు జేసీ వార్నింగ్..!

JC Prabhakar Reddy Warning To Tipper Owners : తాడిపత్రి (Tadipatri) లో ఇసుక అక్రమ రవాణాపై జేసీ ప్రభాకర్‌ రెడ్డి (JC Prabhakar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేస్తూ.. అక్రమాలకు పాల్పడుతున్న సొంత పార్టీ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రిలో ఇసుక రవాణా చేసే 25 మంది నా ఆప్తులేనని.. నాకు ప్రాణాలు ఇచ్చేవారని అన్నారు. దయచేసి వారంతా వెంటనే ఇసుక అక్రమ రవాణాను ఆపేయాలని విజ్ఞప్తి చేశారు. ఇసుక అక్రమ రవాణా చేసి నాకు దూరం కావొద్దని జేసీ వీడియోలో పేర్కొన్నారు.

Also Read: కడపలో ముదిరిన చెత్త యుద్ధం.. మేయర్ ఇంట్లో చెత్త వేసి రచ్చ రచ్చ..!


తాడిపత్రి మున్సిపాలిటీ ద్వారా ఇసుక సరఫరా చేస్తామని తెలిపారు. అక్రమ రవాణా చేసే టిప్పర్లను వదిలిపెట్టనంటూ జేసీ హెచ్చరించారు. గత ప్రభుత్వంలో ఇసుక అక్రమ రవాణాపై ఎంతో పోరాటం చేశానన్నారు. నా కోసం ఐదు సంవత్సరాలు కష్టపడిన మీరు ఇలా అక్రమంగా ఇసుక రవాణా చేసి నాకు దూరం కావొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు