Latest News In Telugu Telangana Elections: తెలంగాణలో పోటీ చేస్తారా లేదా.. బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ-జనసేన కూటమిపై చర్చలు జరిపారు. తెలంగాణలో కనీసం 30 స్థానాల్లో పోటీ చేయాలని తమ పార్టీ కేడర్ నుంచి ఒత్తిడి ఉందని ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. సీట్ల విషయంపై స్పష్టమైన నిర్ణయం తీసుకునేందుకు మరో రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఢిల్లీలోనే ఉండనున్నట్లు సమాచారం. By B Aravind 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: వారం,పదిరోజుల్లో ఉమ్మడి కార్యాచరణతో వస్తాం.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు రాజమండ్రిలోని జేఏసీ సమావేశం అనంతరం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో వారం, పది రోజుల్లో ఉమ్మడి కార్యాచరణతో ప్రజల ముందుకు వస్తామని తెలిపారు. టీడీపీ-జనసేన ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై, ఉమ్మడి ప్రణాళికపై లోతుగా చర్చించామని.. అలాగే ఉమ్మడి మేనిఫెస్టోపై కూడా దాదాపు 3గంటలసేపు చర్చించామని పేర్కొన్నారు. వైసీపీ అరచకానికి జనసేన-టీడీపీ ప్రభుత్వమే విరుగుడు అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకత్వం కూడా మాతో కలిసి రావడానికి సానుకూలంగా ఉందని.. ఎట్టి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేక ఓటు చీలనీవ్వమని స్పష్టం చేశారు. By B Aravind 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP-Janasena: రాజమండ్రి వేదికగా రాష్ట్ర రాజకీయాలు! రాజమండ్రి హోటల్ మంజీరాలో భేటీ కానున్న టీడీపీ జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ. మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. సమావేశంలో జనసేన అధినేత పవన్, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాల్గొననున్నారు. By Bhavana 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: పవన్ కల్యాణ్ కు ట్యూషన్ చెబుతా.. మంత్రి బొత్స సంచలన వాఖ్యలు పవన్ కల్యాణ్ ఏదైనా అంశంపై మాట్లాడే ముందు అవగాహన పెంచుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. కావాలంటే ఆయనకు ట్యూషన్ చెప్పడానికి తాను సిద్ధం అన్నారు. By Nikhil 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Harirama Jogaiah: అధినేత ఏ నిర్ణయం తీసుకున్న ఆయన వెంటే మేము! చంద్రబాబు జైల్లో ఉన్నప్పటికీ..టీడీపీకి నాయకత్వ లోటు ఏమి ఉండదని, రానున్న రోజుల్లో చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి, లోకేష్ భార్య బ్రహ్మణి కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నాయని హరిరామ జోగయ్య పేర్కొన్నారు. By Bhavana 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pawan Kalyan: బీజేపీతో కలిసి పోటీ చేస్తారా లేదా మద్దతిచ్చి తప్పుకుంటారా.. పవన్ దారెటు.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌తో కలిసి పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. తన కార్యాలయానికి విచ్చేసిన వీరిద్దరికి పవన్ కళ్యాణ్ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన చర్చల్లో జనసేన తెలంగాణ నేతలు తన వద్ద వెలిబుచ్చిన అభిప్రాయాలను పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలకు వివరించారు. ఈ మీటింగ్‌పై టీబీజేపీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. By B Aravind 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pawan Kalyan: ఎన్నికల్లో మాకు మద్దతివ్వాలని పవన్ కళ్యాణ్‌ను కోరిన కిషన్ రెడ్డి, లక్ష్మణ్.. పవన్ కళ్యాణ్ అటు ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా తమ పార్టీ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని జనసేన తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయంలో పవన్.. జనసేన నాయకులతో భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయాల్సిందేనని జనసేన తెలంగాణ నాయకులు పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. By B Aravind 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మీకెన్ని..? మాకెన్ని..?.. సీట్ల లెక్క తేల్చనున్న టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ.. ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో రాష్ర్టంలో రాజకీయ పార్టీలు స్పీడు పెంచాయి. ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఇప్పటినుంచే కసరత్తులు ప్రారంభించాయి. రానున్న ఎన్నికల్లో కలిసి పోటీచేస్తామని ప్రకటించిన టీడీపీ-జనసేన పార్టీలు పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నాయి. సీట్ల పంపకాలు, నాయకుల మధ్య సమన్వయం కోసం ఇరు పార్టీలు కమిటీలను ఏర్పాటు చేశాయి. టీడీపీతో సమన్వయం కోసం నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో గతంలోనే జనసేన పార్టీ కమిటీని ఏర్పాటు చేసింది. By Sadasiva 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ kethamreddy: జనసేనకు మరో భారీ షాక్..ఆ నేత గుడ్ బై చెప్పేశాడు! నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి (Ketamreddy vinod kumar reddy) రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జనసేన పార్టీకి రాజీనామా చేయడంతో పాటు రేపు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు వెల్లడించారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరుఫున నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన వినోద్ రెడ్డి..ఓటమి పాలయ్యారు By Bhavana 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn