Harirama Jogaiah: బాబును సీఎం చేయడమే నీ పనా? పవన్‌కు హరిరామ ఘాటు లేఖ! జనసేనతో పొత్తు లేకుండా టీడీపీ గెలవడం అసాధ్యమన్నారు హరిరామ జోగయ్య. 28,30 కాదు కనీసం 50 సీట్లు జనసేన తీసుకోవాలన్నారు హరిరామ. అధికారమంతా చంద్రబాబుకు ధారపోసి. రాష్ట్రప్రయోజనాలను ఎలా కాపాడుతావని పవన్‌ను నిలదీశారు హరిరామ జోగయ్య. By Trinath 05 Feb 2024 in విజయనగరం టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Harirama Jogaiah Letter to Pawan: పవన్ కల్యాణ్‌కు కాపు నేత హరిరామ జోగయ్య చుక్కలు చూపిస్తున్నారు. ఈసారి మరింత ఘాటుగా జనసేన అధినేతకు లేఖ రాశారు హరిరామ జోగయ్య. వైసీపీని రాజ్యాధికారం నుంచి తప్పించడం అంటే టీడీపీకి (TDP) అధికారం పూర్తిగా కట్టబెట్టడం కాదన్నారు. కాపులు పవన్ వెంట నడుస్తుంది బాబును సీఎంను చేయడానికి కాదన్న విషయాన్ని పవన్ (Pawan Kalyan) గుర్తు పెట్టుకోవాలని హరిరామ జోగయ్య విమర్శలు గుప్పించారు. రెండున్నరేళ్లు పవన్ సీఎంగా ఉండాల్సిందేనని హరిరామ డిమాండ్ చేశారు. పవన్ సీఎం అభ్యర్థిత్వంపై చంద్రబాబు (Chandrababu) ప్రకటన చేయాలన్నారు హరిరామ. అధికారమంతా చంద్రబాబుకు ధారపోస్తావా? జనసేనతో (Janasena) పొత్తు లేకుండా టీడీపీ గెలవడం అసాధ్యమన్నారు హరిరామ జోగయ్య. జనసేనకు టీడీపీ టికెట్లు కేటాయించడం కాదని.. జనసేనే టీడీపీకి టికెట్లు ఇచ్చే పరిస్థితి రావాలన్నారు. 28,30 కాదు కనీసం 50 సీట్లు జనసేన తీసుకోవాలన్నారు హరిరామ. 50సీట్లలో పోటీ చేసినపుడే రాజ్యాధికారం వస్తుందని హరిరామ అభిప్రాయపడ్డారు. అధికారమంతా చంద్రబాబుకు ధారపోసి. రాష్ట్రప్రయోజనాలను ఎలా కాపాడుతావని పవన్‌ను నిలదీశారు హరిరామ జోగయ్య. 32 ఇస్తారా? మరోవైపు టీడీపీ,జనసేన మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కివచ్చినట్టే కనిపిస్తోంది. 20 సీట్లపై ఇరుపార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందన్న టాక్ నడుస్తోంది. పవన్ కల్యాణ్ 32 సీట్లు అడుగుతుండగా.. గోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాలో ఎక్కువ సీట్లకు ప్రపోజల్ ఉందని టాక్. రాజోలు, రాజానగరం, కాకినాడ రూరల్, యలమంచిలి, భీమవరం, నరసాపురం స్థానాలపై ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరిందట. విజయవాడ వెస్ట్, తెనాలి, దర్శి, పోలవరం సీట్లను జనసేన అడుగుతోంది. కాకినాడ, మచిలీపట్నం లోక్‌సభ సీట్లు జనసేనకే ఇస్తారని ప్రచారం జరుగుతోంది. నిన్నటి చర్చల్లో అనకాపల్లి, తిరుపతి స్థానాల్లో ఒకటి ఇవ్వాలని పవన్ కోరారు. త్వరలో పాలకొల్లు లేదా మరో ప్రాంతంలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి8న మరోసారి చంద్రబాబు,పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. 14లోపు జనసేనకు ఇచ్చే సీట్లపై నేతలకు బాబు క్లారిటీ రానుంది. Also Read: వారసత్వ రాజకీయాలతో దేశానికి చాలా నష్టం.. మోదీ లాస్ట్ స్పీచ్! #chandrababu #tdp #janasena #pawan-kalyan #harirama-jogaiah మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి