Ap Ration Card: ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం!
ఏపీ లో రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. వచ్చే నెల నుంచే రేషన్ కార్డు దారులకు తక్కువ ధరకే కందిపప్పు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఏపీ లో రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. వచ్చే నెల నుంచే రేషన్ కార్డు దారులకు తక్కువ ధరకే కందిపప్పు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఏపీలో వాలంటీర్ వ్యవస్థ పునరుద్ధరణపై కూటమి ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. అయితే పరిమిత సంఖ్యతోనే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనుంది.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి పదవి ఆశించకుండా జనసేన పార్టీలో చేరబోతున్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దొరబాబును కాదని వంగా గీతకు పిఠాపురం టికెట్ ఇచ్చింది వైసీపీ హైకమాండ్.
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన భూదందాలు చేశారంటూ VMRDAకు జనసేన నేత మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. అనకాపల్లి జిల్లా విస్సన్నపేటలో సర్వే నెంబర్ 195/2లో గల 609 ఎకరాల ప్రభుత్వ భూమిలో నిబంధనలు విరుద్ధంగా లేఔట్లు వేసి విక్రయించారంటూ పేర్కొన్నారు.
జనసేన పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలకు కీలక పదవులు దక్కాయి.జనసేన పార్టీ కొద్ది రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను అధికారిక విప్‌లుగా ప్రకటించాలని లేఖలో కోరారు.
ఎర్ర మట్టిదిబ్బలు విషయంలో ప్రభుత్వాలు మారినా పరిస్థితులు ఏమీ మారలేదని అంటున్నారు పర్యావరణ ప్రేమికులు. అప్పుడు జగన్ పార్టీని తిట్టారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మారినా.. ముద్రగడ ముద్రగడేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసంలో మాజీ మంత్రి అంబటి సమావేశం అయ్యారు.
ప్రతీ ఒక్క నాయకుడు విషయ పరిజ్ఞానం పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజలిచ్చిన గొప్ప విజయాన్ని దుర్వినియోగం చేయొద్దని చెప్పారు. అధికారంతో ఇష్టానుసారంగా ప్రవర్తించేవారి పై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.
AP: పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను కేంద్రంలోకి రావాలని ప్రధాని మోదీ ఆహ్వానించారని అన్నారు. తనకు కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తానని ఆఫర్ ఇచ్చినట్లు చెప్పారు. కానీ, అందుకు తాను ఒప్పుకోలేదని.. రాష్ట్రంలోనే ఉంటానని మోదీకి తాను చెప్పానని అన్నారు.