Janasena : జనసేన పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలకు కీలక పదవులు దక్కాయి. ఏపీ అసెంబ్లీ (AP Assembly) లో జనసేన పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా రాష్ట్ర పార సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయం గురించి స్పీకర్‌కి డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సమాచారం అందించారు. పార్టీ చీఫ్ విప్‌గా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, కోశాధికారిగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కార్యదర్శులుగా విశాఖ సౌత్ ఎమ్మెల్యే చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ , రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ లను నియమించారు. ఈ విషయాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలో ప్రకటించారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan : జనసేన పార్టీ ఐదుగురు ఎమ్మెల్యేలకు కీలక పదవులు
జనసేన పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలకు కీలక పదవులు దక్కాయి.జనసేన పార్టీ కొద్ది రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను అధికారిక విప్‌లుగా ప్రకటించాలని లేఖలో కోరారు.
Translate this News: