Mohammed Deif: హమాస్ మాస్టర్ మైండ్ మహమ్మద్ డెయిఫ్ హతం!
హమాస్‌పై యుద్ధంలో ఇజ్రాయెల్ బలగాలకు భారీ విజయం లభించింది. జులై 13న ఖాన్ యూనిస్‌పై దాడుల్లో హమాస్ మిలిటరీ వింగ్ కమాండర్ మహమ్మద్ డెయిఫ్ హతమైనట్లు ఇజ్రాయెల్ ధ్రువీకరించింది.
హమాస్‌పై యుద్ధంలో ఇజ్రాయెల్ బలగాలకు భారీ విజయం లభించింది. జులై 13న ఖాన్ యూనిస్‌పై దాడుల్లో హమాస్ మిలిటరీ వింగ్ కమాండర్ మహమ్మద్ డెయిఫ్ హతమైనట్లు ఇజ్రాయెల్ ధ్రువీకరించింది.
ఇజ్రాయెల్, లెబనాన్‌లోని హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ మధ్య సరిహద్దు వివాదం తారాస్థాయికి చేరుకుంది.దీంతో లెబనాన్‌లోని రాయబార కార్యాలయం నిన్న సోషల్ మీడియాలో భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని పోస్ట్ లో పేర్కొంది.బీరూట్‌లోని భారత రాయబార కార్యాలయంతో అందుబాటులో ఉండాలని పోస్ట్ లో సూచించింది.
సోమవారం పశ్చిమ గాజాలోని ఖాన్ యునిస్ నగరంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 70 మంది మృతి చెందారు. మరో 200 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఖాన్ యునిస్లో 30 ఉగ్రవాద మౌళిక సదుపాయాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ తెలిపింది.
యెమెన్‌లో హౌతీల స్థావరాలే లక్ష్యంగా అల్ హొదైదా నౌకాశ్రయంతోపాటు పలు లక్ష్యాలపై ఇజ్రాయిల్ బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో పలువురు మరణించగా.. మరికొంతమందికి గాయాలయ్యాయి. నౌకాశ్రయంలో ఉన్న చమురు నిల్వలకు మంటలు అంటుకున్నాయి.
సిరియాపై ఇజ్రాయెల్ దాడులను ఆపడంలేదు. ఓవైపు గాజాపై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం ఇటు సిరియాపైనా దాడులు కొనసాగిస్తోంది. డమాస్కస్‌లోని సైనిక ప్రదేశాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఒక సిరియన్ సైనికుడు మరణించాడు.
హమాస్ కమాండర్‌ను మట్టుబెట్టేందుకు దక్షిణ గాజాలోని ఖాన్ యునిస్‌పై ఇజ్రాయెల్ దళాలు బాంబుల వర్షం కురిపించాయి. అయితే ఈ దాడుల్లో హమాస్ కమాండర్ చనిపోలేదు కానీ 90మంది సామాన్యులు మరణించారు. మరో 300మంది గాయపడ్డారు. 2023 అక్టోబర్ 7 నుంచి హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది.
గాజాలో హమాస్‌తో యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ప్రతి పురుషుడు 34 నెలల పాటు తప్పకుండా మిలటరీలో పనిచేయాలనే నిబంధన ఉండగా.. ఇప్పుడు దాన్ని మరో మూడేళ్ల వరకు పెంచినట్లు సమాచారం.
హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ ప్రధాన నాయకుడు మహ్మద్ నేమ్ నాసా హతమైన ఘటనకు ప్రతి చర్యగా ఇజ్రాయెల్ పై 200కు పైగా రాకెట్లతో దాడి చేసింది.లెబనాన్‌లోని టైర్ నగరంపై ఇజ్రాయెల్ సైన్యం నిన్న వైమానిక దాడి చేసింది. ఇందులో హిజ్బుల్లా ప్రధాన నాయకుడు చనిపోయాడు.దీంతో రాకెట్లతో దాడి చేసింది.
హమాస్ విషయంలో ఇజ్రాయెల్ వెనక్కు తగ్గింది. తమ దగ్గర బందీలను 50 మందికి పైగా ఖైదీలను విడుదల చేసింది. అందులో హమాస్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారని ఆరోపిస్తూ.. గతంలో బందీగా తీసుకెళ్లిన అల్-షిఫా ఆస్పత్రి డైరెక్టర్ మహ్మద్ అబు సల్మియాను ఇజ్రాయెల్ తాజాగా విడుదల చేసింది.