GAZA: ఇజ్రాయెల్ మీద హమాస్ ఎదురుదాడి..8 మంది సైనికులు మృతి
హమాస్ ఫైటర్లు జరిపిన దాడిలో ఎనిమిది మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ స్వయంగా ధృవీకరించింది. పేలుడు కారణంగా వారు మరణించారని చెప్పింది.
హమాస్ ఫైటర్లు జరిపిన దాడిలో ఎనిమిది మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ స్వయంగా ధృవీకరించింది. పేలుడు కారణంగా వారు మరణించారని చెప్పింది.
గాజాలో మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సెంట్రల్ గాజాలో హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య భీకరపోరు సాగుతోంది. ఇందులో దాదాపు 200 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 400మంది దాకా గాయపడ్డారని సమాచారం.
ఇజ్రాయెల్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లోని లక్షద్వీప్ తో పాటు పలు బీచ్ లకు వెళ్లొచ్చంటూ ఇజ్రాయెల్ తన ప్రజలకు తెలిపింది. ఇటీవల గాజాలోని పాలస్తీనియులకు మద్దతుగా మాల్దీవులు ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
పాలస్తీనాలోని రఫా నగరంలో ఓ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి చేయడం ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతోంది. చిన్నారులు, మహిళలతో సహా.. 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయితే పలువురు సెలబ్రిటీలు ఆన్లైన్ వేదికగా ఈ దాడిని ఖండిస్తున్నారు.
ఇజ్రాయెల్ పై 'బిగ్ మిస్సైల్'ను ప్రయోగించింది హమాస్. దక్షిణ గాజాలోని రఫా ప్రాంతం నుంచి సెంట్రల్ ఇజ్రాయెల్ వైపు ఎనిమిది రాకెట్లు పేల్చినట్లు ఇజ్రాయెల్ మిలటరీ పేర్కొంది. అత్యవసర వైద్య సేవల బృందం తమకు ప్రాణనష్టం గురించి ఎలాంటి నివేదికలు అందలేదని తెలిపింది.
ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా గ్రూప్.. ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు జారీ చేసింది. తమ నుంచి ఇజ్రాయెల్ త్వరలో 'సర్ప్రైజ్' అందుకోబోతుందంటూ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్‌పై దాడి చేసే ఛాన్స్ ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు.
ఇజ్రాయెల్‌కు చెందిన EVR మోటార్స్.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సరఫరాదారుగా ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ఈ కంపెనీ తొలిసారిగా భారత్‌లో తన తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. భారత్‌లో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన తొలి ఇజ్రాయెల్ కంపెనీ కూడా ఇదే.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అకాల మరణంపై ఇజ్రాయెల్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఆదివారం సాయంత్రం హెలికాప్టర్ ప్రమాదం, ఇబ్రహీం మరణంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
కైరోలో కాల్పుల విరమణ చర్చలపై ఆశలు సన్నగిల్లడంతో దక్షిణ గాజా స్ట్రిప్ నగరమైన రఫా సమీపంలో హమాస్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇజ్రాయేల్ సైనికులు మృతి చెందారు. దీంతో ఇజ్రాయేల్ ప్రతీకార చర్యకు దిగింది. రాఫా పై విరుచుకుపడింది. ఈ దాడిలో 19 మంది మరణించినట్టు చెబుతున్నారు.