Hormuz Strait: భారత్‌ కు బిగ్‌ షాక్‌...‘హర్మూజ్‌ జలసంధి’ మూసివేత..?

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా బాంబులతో విరుచుకుపడుతున్నప్రస్తుత సమయంలో ప్రపంచ చమురు మార్కెట్‌కు జీవనాడిగా పేర్కొనే హర్మూజ్‌ జలసంధిని మూసివేయాలని ఇరాన్‌ నిర్ణయం తీసుకునే దిశగా ఆడుగులు వేస్తుంది. ఒకవేళ అదే కనుక జరిగితే ప్రపంచం మీద తీవ్ర ప్రభావం చూపనుంది.

New Update
Israel-Iran War

Israel-Iran War

 Hormuz Strait : ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా బాంబులతో విరుచుకుపడుతున్న ప్రస్తుత సమయంలో ప్రపంచ చమురు మార్కెట్‌కు జీవనాడిగా పేర్కొనే హర్మూజ్‌ జలసంధిని మూసివేయాలని ఇరాన్‌ నిర్ణయం తీసుకునే దిశగా ఆడుగులు వేస్తుందనే ప్రచారం సాగుతోంది. ఒకవేళ అదే కనుక జరిగితే ప్రపంచం మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా భారతదేశంపై ఈ ప్రభావం అధికంగా ఉండనుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్‌ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇరాన్ పై తాజాగా అమెరికా బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో హర్మూజ్‌ జలసంధిని మూసివేసే దిశగా ఇరాన్‌ అడుగులు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇరాన్‌ పార్లమెంట్‌ లో చర్చ జరిగిందని, ఆమోదం కూడా తెలిపిందని తెలుస్తోంది. చివరిగా ఆ దేశ భద్రతా విభాగం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందంటూ మీడియా కథనాలు వెలువడుతున్నాయి.

Also Read: హోటల్‌లో దంపతుల శృంగారం.. కిటికీలు వేసుకోవడం మర్చిపోవడంతో..?

Also Read : బేగంపేటలో భారీ చోరీ..ఏకంగా రూ.48లక్షలు కాజేసి..

కాగా చమురు ఉత్పత్తిలో  సౌదీ, ఇరాన్‌, యూఏఈ, కువైట్‌, ఇరాక్‌ అగ్రస్థానంలో ఉన్నాయి, ఈ దేశాలనుంచే  అత్యధికంగా చమురు ఎగుమతి సాగుతోంది. అయితే ఇందులో ప్రపంచ రోజువారీ చమురు అవసరాల్లో 20 శాతం హర్మూజ్‌ జలసంధి ద్వారానే రవాణా అవుతోంది. ఈ సంధి అరేబియా సముద్రంలో ఒమన్‌కు చెందిన ముసాండం ద్వీపకల్పానికి, ఇరాన్‌కు మధ్య ఉన్నది. ఇది అత్యంత ఇరుకైన జలసంధి.  ఇందులో ఓ చోట అత్యంత ఇరుకుగా కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇదే మార్గం నుంచి నిత్యం 2 కోట్ల బారెళ్ల చమురు వివిధ దేశాలకు సరఫరా అవుతుంది. 

ఇదే మార్గంలో  లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ (ఎల్‌ఎన్‌జీ) అవుతుంది.  అయితే ఇపుడు ఈ సంధిని మూసివేస్తే అంతర్జాతీయ వాణిజ్యం పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా మనదేశం 90 శాతం ముడి చమురును విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. అందులో 40 శాతం హర్మూజ్‌ జలసంధి ద్వారానే రవాణా అవుతోంది. ఒకవేళ కనుక ఇరాన్‌ కనుక దీన్ని మూసివేస్తే భారత్‌ తన 74 రోజుల చమురు నిల్వలను తగ్గించుకోవలసి వస్తుంది. దీనితో పాటు ఈ ప్రభావం ప్రపంచ మార్కెట్‌లో రూపాయి విలువ పతనం కావడానికి దారితీసిన ఆశ్చర్యం లేదు. ప్రపంచ మార్కెట్‌లో ముడిచమురు ధర బ్యారెల్‌కు 90 డాలర్ల వరకు పలుకుతోంది. ఈ సంధిని మూసివేస్తే ధర మరింత పెరిగి భారత ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది.

Also Read : ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం

మన దేశం సౌదీ అరేబియా, ఇరాక్‌, యూఏఈ దేశాల నుంచి అత్యధికంగా ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఈ చమురు నౌకలన్నీ కూడా హర్మోజ్‌ జల సంధినుంచే ప్రయాణిస్తుంటాయి. ప్రపంచ దేశాలు వినియోగించే ఎల్‌ఎన్‌జీ లో 20శాతం ఇక్కడ నుంచే సరఫరా జరుగుతోంది. వీటిని తీసుకు వచ్చే నౌకలన్నీ హర్మూజ్‌ జలసంధి నుంచే రవాణా చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో హర్మోజ్‌ జల సంధిని మూసివేయాలని ఇరాన్‌ నిర్ణయం తీసుకుంటే ఆ ప్రభావం మనదేశం మీద తీవ్రంగా పడే అవకాశం ఉంది.  దీనివల్ల మనదేశంలో ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది. నిత్యవసరాలైన పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పీజీ తదితర ధరలు ఆకాశాన్నంటుతాయి.

Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!

Advertisment
తాజా కథనాలు