IND vs PAK : టీమిండియాతో మ్యాచ్.. పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్
టీమిండియాతో ఫిబ్రవరి 23న జరగనున్న మ్యాచ్ కు ముందు పాకిస్థాన్‌కు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు కీలక ఆటగాడు ఫఖర్ జమాన్ దూరమైనట్లుగా పాక్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్‌లో ఫఖర్ ఫిల్డింగ్ చేస్తుండగా గాయపడ్దాడు.