/rtv/media/media_files/2025/02/25/oV5w0EHwy4bs4B80JpSl.jpg)
Hardik Pandya rumoured girlfriend attend india vs pakistan match
భారత్ vs పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఆదివారం అత్యంత రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో భారత్ బౌలర్ హార్ధిక్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. తన టెంప్టింగ్ బాల్స్‌తో వికెట్లు పడగొట్టాడు.
Also Read: తమిళనాడులో హిందీ భాష వివాదం.. బోర్డులపై నల్ల రంగు పూస్తున్న డీఎంకే కార్యకర్తలు
దాదాపు 2 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్ కోసం అతడి రూమర్స్ ప్రేయసి జాస్మిన్ వాలియా యుఎఇలోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కనిపించింది. ఆ మ్యాచ్‌లో ఫ్లైయింగ్ కిస్‌లు ఇస్తూ రచ్చ రచ్చ చేసింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
As I said @jasminwalia supporting India for #hardik#INDvsPAKhttps://t.co/aMnPfn7n3Cpic.twitter.com/Oo5Gcx6O2I
— Instinct (@Clutchxgod33) February 23, 2025
Also Read: మహా కుంభమేళా పై రాంగ్ న్యూస్... 140 సోషల్ మీడియా అకౌంట్ల పై కేసు నమోదు!
జాస్మిన్ వాలియా ఎవరు?
జాస్మిన్ వాలియా ఒక నటి, గాయని. ఆమె గత కొన్ని రోజులుగా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. దానికి కారణం.. జాస్మిన్, హార్దిక్ పాండ్యా రిలేషన్‌లో ఉన్నారన్న రూమర్సే. తన భార్య, నటి నటాషా స్టాంకోవిక్ నుండి విడిపోయిన తర్వాత హార్ధిక్.. జాస్మిన్‌తో డేటింగ్ చేస్తున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేనప్పటికీ ఈ వార్తలు జోరుగా సాగుతున్నాయి.
Also Read:అల్లు అర్జున్ అంటే పిచ్చి.. అతడితో ఆ సీన్‌లలో అయినా ఓకే: టాలీవుడ్ హీరోయిన్!
నటి జాస్మిన్ వాలియా బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘సోను కే టిటు కి స్వీటీ’లో నటించింది. అలాగే ఆమె 2001లో ‘హ్యారీ పాటర్’ చిత్రంలో కూడా నటించింది. ఈ చిత్రంలో జాస్మిన్ హాగ్వార్ట్స్ పాత్రలో కనిపించింది. దీని తర్వాత జాస్మిన్.. కాజువల్టీ అనే సిరీస్‌లో కూడా పనిచేసింది. అంతేకాకుండా ఆమె గత కొన్ని సంవత్సరాలుగా మ్యూజిక్ వీడియోలలో తరచూ కనిపిస్తుంది. జాస్మిన్ ఇప్పటివరకు చాలా పాటలు కంపోజ్ చేసింది.