బాబర్ అజామ్‌ వేస్ట్ గాడు.. పాక్ చెత్త టీమ్..  షోయబ్ అక్తర్ సంచలన కామెంట్స్!

పాకిస్తాన్ మాజీ పేస్ స్టార్ షోయబ్ అక్తర్ బాబర్ రెచ్చిపోయాడు. బాబర్ అజామ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.  విరాట్ కోహ్లీతో బాబర్ ను పోల్చడం దారుణమని అన్నాడు. బాబర్ మోసగాడు అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. పాక్‌ టీమ్ గురించి మాట్లాడటం వేస్ట్ అని ఫైరయ్యాడు.

New Update
babar azam

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నిన్న భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఘోరంగా ఓడిపోయింది. దీంతో పాక్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ ఓటమితో పాకిస్థాన్ గ్రూప్ దశ నుండే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది. భారత్ పై ఓటమితో అభిమానులతో పాటుగా సీనియర్ ఆటగాళ్లు పాక్ జట్టుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. భారత్ చేతిలో పాకిస్థాన్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోవడంపై మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. 

 విరాట్ కోహ్లీతో పోల్చడం దారుణం 

తాజాగా పాకిస్థాన్ మాజీ పేస్ స్టార్ షోయబ్ అక్తర్ బాబర్ రెచ్చిపోయాడు. బాబర్ అజామ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.  విరాట్ కోహ్లీతో బాబర్ ను పోల్చడం దారుణమని అన్నాడు. సచిన్ లాంటి లెజెండ్ ను  కోహ్లీ ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాడని.. నువ్వు ఎవరిని ఆదర్శంగా తీసుకున్నావ్ అని అక్తర్ ప్రశ్నించాడు. బాబర్ మొదటినుంచి మోసగాడు అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. జట్టులో  తప్పుడు వ్యక్తులను ప్రోత్సహించావు అంటూ మండిపడ్డాడు. ఇక పాక్‌ టీమ్ గురించి మాట్లాడటం వేస్ట్ అని ఫైరయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 26 బంతుల్లో 23 పరుగులు మాత్రమే చేసి హార్దిక్ పాండ్యా చేతిలో ఔటయ్యాడు బాబార్. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ 42.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. కోహ్లీ 100 పరుగులతో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.  ఇక  న్యూజిలాండ్, భారత్ జట్లతో ఓడిపోయిన పాక్ జట్టు.. న్యూజిలాండ్ చేతిలో కూడా ఓడిపోతే అధికారికంగా టోర్నమెంట్ నుండి నిష్క్రమించినట్లు అవుతుంది.  

Also Read :  BAN vs NZ : బంగ్లాకు చావో రేవో.. న్యూజిలాండ్‌ టార్గెట్ 237

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు