Hyd: ఐదు రోజులు ఎండ దంచికొడుతుంది..జాగ్రత్త అంటున్న వాతావరణశాఖ
ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఫిబ్రవరి సగం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ లో అప్పుడే 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ చెబుతోంది. 37 నుంచి 40 ఢిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరిస్తోంది.