పోలింగ్ బూత్ దగ్గర విషాదం.. గుండెపోటుతో ఎమ్మెల్యే అభ్యర్థి మృతి
బీడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలాసాహెబ్ షిండే గుండె పోటుతో పోలింగ్ బూత్ దగ్గర అకస్మాత్తుగా మరణించారు. వెంటనే షిండేను ఆసుపత్రికి తరలించిన అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఖమ్మంలో కన్నీరు పెట్టించే ఘటన.. గ్రూప్-3 ఎగ్జామ్ రాసి వస్తున్న తల్లి వైపు పరిగెత్తుతూ..!
గ్రూప్-3 పరీక్ష రాసి వస్తున్న తల్లిని చూసిన చిన్నారి అమ్మొచ్చిందంటూ సంబరపడింది. తల్లిని హత్తుకునేందుకు గుమ్మం వైపు పరుగు తీసింది. కానీ అమ్మను చేరక ముందే ఆ బిడ్డ గుండెపోటుతో కుప్ప కూలింది. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
Heart Attack: గుండె పోటు నుంచి తప్పించుకోవాలంటే.. ఈ పనులు చేయండి!
జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల గుండెపోటు కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కూరగాయలు-పండ్లు, గింజలు, విత్తనాలు తింటే గుండుకు మంచిదని చెబుతున్నారు. ధూమపానం-మద్యపానం మానుకోవాలని సూచిస్తున్నారు.
Hyderabad: గుడిలో ప్రదక్షిణలు చేస్తూ గుండెపోటుతో
HYDలో విషాదం ఘటన వెలుగుచూసింది. KPHBలోని ఆంజనేయస్వామి గుడిలో విష్ణువర్ధన్ చనిపోయాడు. ఉదయం ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కింద పడిపోయాడు
Viral: బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు..కండక్టర్ ఏం చేశాడంటే!
ఓ డ్రైవర్ గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో బస్సు కండక్టర్ వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. సోషల్ మీడియా వినియోగదారులు కండక్టర్‌ను ప్రశంసించారు. అయితే కోవిడ్ తర్వాత పెరుగుతున్న గుండెపోటు కేసుల గురించి ఆందోళనలు తలెత్తుతున్నాయి.
Heart Attack: పిల్లల్లో కూడా గుండెపోటు రావడానికి కారణం ఇదే
ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే పిల్లలకు గుండెపోటు వస్తుంది. చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల ఒత్తిడి వల్ల పిల్లల గుండెపై ప్రభావం చూపిస్తున్నాయి. పిల్లవాడు లావుగా ఉంటే కొవ్వును కరిగించడానికి వ్యాయామాలు చేయించాలని నిపుణులు చెబుతున్నారు.
Heart Health: ఇలా చేస్తే గుండెపోటు అస్సలు రాదు!
ఈ మధ్య గుండెపోటు కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. అయితే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, నిద్రలేమి, మద్యపానం వంటి అనేక విషయాలు దీనికి కారణం. ప్రతి రోజు శారీరక శ్రమ, హెల్తీ డైట్ తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
Karimnagar : విషాదం.. గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి!
TG: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఐదేళ్ల చిన్నారి గుండెపోటు మరణించడం స్థానికంగా కలచివేసింది. రాజు-జమున దంపతుల కూతురు ఉక్కులు నిన్న ఉదయం కళ్ళుతిరుగుతున్నాయని చెప్పడంతో ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షలు చేస్తున్న సమయంలో గుండెపోటుతో ఆమె చనిపోయింది.