Health Tips: రాత్రిపూట ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
రాత్రిపూట చేసే ఈ తప్పుల వల్ల బరువుతోపాటు ఊబకాయం పెరుగుతుంది. అర్థరాత్రి భోజనం చేయకూడదు. జంక్ ఫుడ్ తినకూడదు. సరిపడా నీరు తాగకపోయినా.. తగినంత నిద్ర లేకపోయినా చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.
రాత్రిపూట చేసే ఈ తప్పుల వల్ల బరువుతోపాటు ఊబకాయం పెరుగుతుంది. అర్థరాత్రి భోజనం చేయకూడదు. జంక్ ఫుడ్ తినకూడదు. సరిపడా నీరు తాగకపోయినా.. తగినంత నిద్ర లేకపోయినా చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.
శరీరంలో వ్యర్థ పదార్ధాల స్థాయి పెరిగినప్పుడు అనేక వ్యాధులు వస్తాయి. యూరిక్ యాసిడ్ పెరిగితే కీళ్ల నొప్పులు, వాపులు, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకని ఉదయం ఖాళీ కడుపుతో సొరకాయ జ్యూస్‌ని తాగితే సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
పీసీవోడీ సమస్య వల్ల జుట్టు రాలడం, అలసట, బలహీనత, మానసిక కల్లోలంతోపాటు అనేక రకాల ఇబ్బందులను మహిళలు ఎదుర్కొంటారు. దీనిపై సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ సమస్య ఉన్న వారు జంక్, రిఫైన్డ్ ఫుడ్ అస్సలు తినకూడదు.
ఉడికిన ఆహారాలు రోజులో ఎక్కువసార్లు తినడం మంచిది కాదు. ఉడికిన ఆహారాలు తిన్న తర్వాత చాలామందికి డల్‌గా నిద్రొచ్చినట్లు అనిపిస్తుంది. అదే పండ్లను తీసుకుంటే యాక్టీవ్ గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు
ఏదైనా తినటానికి ముందే నీరు తాగితే అనేక లాభాలు ఉంటాయి. ఎసిడిటీ, అల్సర్ వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా తిన్న పదార్థాలు సైతం త్వరగా జీర్ణం అవుతాయని వివరిస్తున్నారు.
చద్దన్నంలో పెరుగు, ఉల్లిపాయ వేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు. దీనివల్ల కడుపు ఉబ్బరం, మలబద్ధకం, పేగుల్లో పూతలు రావు. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఆయిల్‌తో చేసే టిఫిన్స్ కంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
పేగులను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పండ్ల రసం, ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ ఆహార పదార్థాలు, మేక పాలను చేర్చుకోవాలి. ఇంకా.. నూనె, సుగంధ ద్రవ్యాలు ఆహారంలో తక్కువ పరిమాణంలో ఉండేలా జాగ్రత్త పడాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఉదయాన్నే నీరు తాగటం ఆరోగ్యానికి ఎంతో మేలు. రోగనిరోధకశక్తి పెరగటంతోపాటు మలం విసర్జించడం సులభం అవుతుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఖాళీ కడుపుతో టీ, జ్యూస్ తాగితే దంతాలు పాడైపోయి కుహరం ఏర్పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఏదైనా తిన్న తర్వాత కడుపులో తీవ్రమైన నొప్పి, వాంతులు, విరేచనాలు, ఆహారం జీర్ణంకాకపోవడం, బలహీనత వంటివి అనిపిస్తే ఇవి ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కావచ్చు. చిరుతిళ్లు, బిస్కెట్లు, ప్యాక్ చేసిన ఆహారాల గడువును తనిఖీ చేసి తినాలని నిపుణులు చెబుతున్నారు.