Health Tips: ఈ ఆహారానికి దూరంగా ఉండండి.. మీకే మంచిది!

ఉడికిన ఆహారాలు రోజులో ఎక్కువసార్లు తినడం మంచిది కాదు. ఉడికిన ఆహారాలు తిన్న తర్వాత చాలామందికి డల్‌గా నిద్రొచ్చినట్లు అనిపిస్తుంది. అదే పండ్లను తీసుకుంటే యాక్టీవ్ గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు

New Update
Health Tips: ఈ ఆహారానికి దూరంగా ఉండండి.. మీకే మంచిది!

Health Tips: మన తీసుకునే ఆహారంపైనే మన తెలివి, మేధాశక్తి ఆధారపడి ఉంటుంది. మన జీవితాన్ని తెలివి, మేధాశక్తితో గడపాలంటే ప్రకృతి సిద్ధమైన ఆహారాలైనా నేచురల్ ఫుడ్‌ను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు శరీరానికి మంచి జరుగుతుంది. అందులో ఒకటి ఉడికించిన ఆహారాలు. ఉడికించిన ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటిని ఎక్కువగా తింటే అనవసరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉడికించిన ఆహారాలు ఎక్కువగా తింటే ఏమవుతుందో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు చూద్దాం.

publive-image

ఉడికిన ఆహారాలు తిన్న తర్వాత చాలామందికి మొబ్బగా, బద్దకంగా, డల్‌గా నిద్రొచ్చినట్టు అనిపిస్తుంది. దీని ప్రధాన కారణమేమిటంటే ఉడికిన ఆహారాలు జీర్ణం అవటానికి మన పిలుచుకున్న ప్రాణవాయువులో 25 నుంచి 30% శాతం అరిగించడానికి వెళ్ళిపోతుంది. శరీరంలో ప్రాణవాయువు బయటకు వెళ్ళటంతో మనకు డల్‌గా మొబ్బగా అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

publive-image

అందుకని రోజులో నాలుగు సార్లు ఉడికిన ఆహారాలు తీసుకుంటే సగభాగం సమయం మొత్తం మొబ్బగా, మత్తుతోనే గడిచిపోతుందని చెబుతున్నారు. కాబట్టి ఉడికిన ఆహారాలు రోజులో ఎక్కువసార్లు తినడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పూర్వకాలంలో ఋషులు వండుకునే ఆహారాలకు దూరంగా ఉండేవారు. అంతేకాదు వారంత ప్రకృతి సిద్ధమైన ఆహారాలైన నాచురల్‌ పుడ్‌ తిని రోజంత శక్తితో, తెలివి, మేధాశక్తితో వాళ్ల జీవితాన్ని సార్థకం చేసుకునేవారు. అందుకని ఉదయం, సాయంత్రం నాచురల్ ఫుడ్ ఎక్కువగా తినగలిగితే యాక్టివ్‌గా, అలర్ట్‌గా ఉంటామని అందరం దీనిని గుర్తుపెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: జ్యూస్ ఫాస్టింగ్‌తో ఆ సమస్యలన్నీ పరార్!

Advertisment
తాజా కథనాలు