/rtv/media/media_files/2025/07/27/hair-fall-2025-07-27-19-29-26.jpg)
Hair Fall
Life style: ఈ మధ్య చాలా మంది ఆడపిల్లలను వేధిస్తున్న కామన్ సమస్య హేయిర్ ఫాల్. కాలుష్యం, పోషకాహార లోపం ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు నిపుణులు. పోషకాహార లోపం వల్ల కలిగే కొన్ని జుట్టు సమస్యలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
జుట్టు సమస్యలు.. లోపాలు
అకాల బూడిద జుట్టు
తెల్ల జుట్టు రావడానికి విటమిన్ బి12 లోపం కావచ్చు. గుడ్లు, చేపలు, మాంసం, పాల ఉత్పత్తులు, వంటి విటమిన్ బి12 అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల అకాలంలో జుట్టు తెల్లబడే సమస్యను అరికట్టవచ్చు. వయసు పైబడిన తర్వాత తెల్ల జుట్టు రావడం సహజం.
జుట్టు పల్చబడడం..
శరీరంలో ఐరన్ లోపం, ఒత్తిడి, రుతువిరతి సమయంలో హార్మోన్ల అసమతుల్యత వంటి కారణాలు వల్ల జుట్టు పల్చబడటం జరుగుతుంది. ఐరన్ తో పాటు విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తినడం ద్వారా జుట్టు పల్చబడటం తగ్గుతుంది.
జుట్టు విరిగిపోవడం, గుత్తులుగా రాలిపోవడం
కొంతమందికి జుట్టు విరిగిపోవడం, గుత్తులు గుత్తులుగా రాలిపోవడం జరుగుతుంది. ఇలాంటి సమస్య ఉన్నవారిలో విటమిన్ సి లేదా ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్స్ లోపం ఉండవచ్చు. కొన్ని సార్లు థైరాయిడ్ అసమతుల్యత వల్ల కూడా ఇది జరుగుతుంది. ఈ సమస్యను తగ్గించడానికి విటమిన్ సి, ఒమేగా 3 అధికంగా ఉండే సాల్మన్ ఫిష్, అవిసె గింజలు, వాల్‌నట్స్, చియా గింజలు, సిట్రస్ పండ్లు, ఆమ్లా వంటి ఆహారాలను తినండి.
చుండ్రు ఎక్కువగా ఉండటం
ఈ మధ్య చాలా మందిని చుండ్రు సమస్య ఎక్కువగా వేదిస్తోంది. శరీరంలో విటమిన్ B6 తో పాటు జింక్ లోపం వల్ల తలలో చుండ్రు సమస్యకు కారణం అవుతుంది.
జుట్టు రాలడం
జుట్టు బాగా రాలిపోతుంటే శరీరంలో ప్రొటీన్, ఐరన్ లెవెల్స్ తగ్గుతున్నాయని సంకేతం. అయితే కొన్ని సందర్భాల్లో థైరాయిడ్, స్ట్రెస్, కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. ప్రెగ్నెన్సీ తర్వాత కూడా కొందరికి జుట్టు రాలాడం జరుగుతుంది. ఈ సమస్యను నివారించడానికి గుడ్లు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, మషురూమ్స్ ఆహరంలో తీసుకోవాలి.