Vikarabad: కరెంట్ షాక్ కొడుతున్న స్కూల్.. హడలిపోయిన విద్యార్థులు! వికారాబాద్ జిల్లా హస్నాబాద్ ప్రభుత్వ పాఠశాల భవనాలు షాక్ కొట్టడం కలకలంరేపుతోంది. బోర్డు, గోడలు, కిటికీలు, తలుపులకు షాక్ రావడంతో విద్యార్థులు హడలిపోయారు. 80 ఏళ్ల క్రితం నిర్మించిన భవనం వర్షాలకు తడవటంవల్లే ఇలా జరిగిందని ప్రధానోపాధ్యాయుడు నర్సింలు తెలిపారు. By srinivas 16 Jul 2024 in జాబ్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి Govt School: తెలంగాణలోని వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హస్నాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠాశాల కరెంట్ షాక్ కొట్టడం కలకలం రేపుతోంది. మంగళవారం ఉదయం రోజులాగే పాఠశాలకు వెళ్లిన పిల్లలు క్లాస్ రూమ్ లోకి వెళ్లకముందే పాఠశాల భవనాన్ని ఎక్కడ ముట్టుకున్నా కరెంట్ షాక్ కొడుతున్నట్లు టీచర్లకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే సిబ్బందితో కలిసి చెక్ చేయగా.. బోర్డు, గోడలు, కిటికీలు, తలుపులు దేన్ని టచ్ చేసినా విద్యుతాఘాతం విసిరికొట్టింది. దీంతో విద్యార్థులు, పాఠశాల సిబ్బంది హడలిపోయారు. 80 ఏళ్ల క్రితం నిర్మించిన స్కూలు భవనం.. ఈ క్రమంలోనే వెంటనే విద్యుత్త సిబ్బందికి సమాచారం అందిచగా.. పాఠశాలకు విద్యుత్ సరఫరా నిలిపేశారు. దీంతో ఆదివారం పూర్వ విద్యార్థులు సమ్మేళనం కోసం నిర్వహించిన టెంట్ కింద, వరండాలో తరగతులు నిర్వహించారు. ఈ పాఠశాలలో 6నుంచి 10 తర గతులకు చెందిన 236 మంది చదువుతుండగా.. 9 మంది బోధనా సిబ్బంది, ఇద్దరు బోధనేతర సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. 80 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ స్కూలు భవనం ఇటీవల కురుస్తున్న వర్షాలకు తడిసిముద్దైందని, స్లాబ్ కుర వడంతో పాటు పగుళ్లు వచ్చిన గోడల్లో నీళ్లు నిలిచాయని ప్రధానోపాధ్యాయుడు నర్సింలు వెల్లడించారు. తరగతి గదుల్లో పూర్తిగా నీరు చేరింది. చిన్నపాటి వర్షానికే తరగతి గదుల్లో నీరు నిలుస్తోంది. కరెంట్ షాక్ కొట్టడం ఆందోళన కలిగించిందన్నారు. #vikarabad-husnabad #government-school #current-shock మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి