Ghee And Dal: పప్పులో నెయ్యి కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
పప్పులో నెయ్యి కలుపుకుని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వీటితో పాటు అజీర్ణం, కడుపు సంబంధిత సమస్యలు, మలబద్ధకం నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది.
పప్పులో నెయ్యి కలుపుకుని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వీటితో పాటు అజీర్ణం, కడుపు సంబంధిత సమస్యలు, మలబద్ధకం నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది.
వెన్న, నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇవి శరీరానికి మేలు చేయటంతోపాటు ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను అందిస్తుంది. బిస్కెట్లు, బేకరీ ఐటమ్లు వంటి వాటిల్లో అనారోగ్యకరమైన కొవ్వులను తెలియకుండానే తింటాము. దుకాణం నుంచి నెయ్యి కొనుగోలు చేసేటప్పుడు లేబుల్‌ను చదివి తీసుకోవాలి.
నెయ్యిలో ఉండే యాంటీ బ్యాక్టీరియా గుణాలు జలుబు, దగ్గు వంటి ఎన్నో సమస్యలను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నెయ్యి తినటం వల్ల ఇమ్యూనిటీ పవర్ ను, జీర్ణశక్తిని పెంచుతుందని అంటున్నారు. నెయ్యిని పరిగడుపున తింటే చర్మంపై ముడతలు తొందరగా రావని నిపుణులు చెబుతున్నారు.
ఈ మధ్యకాలంలో బరువు తగ్గడానికి చాలామంది నెయ్యిని ఉపయోగిస్తున్నారు. ఇంతకీ బరువు తగ్గడంలో నెయ్యి హెల్ప్ చేస్తుందా? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా?
ప్రతిరోజూ పరిమిత పరిమాణంలో నెయ్యి తీసుకోవాలి. ప్రతిరోజూ కనీసం 2 టీస్పూన్ల దేశీ నెయ్యి తినాలని ఆరోగ్య నిపుణులు చేస్తున్నారు. దీంతో ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి. మోకాళ్లు లూబ్రికేట్‌గా ఉండి నొప్పి సమస్య తగ్గుతుంది. అయితే కూరగాయల నూనెను ప్రత్యామ్నాయంగా తినాలి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో పసుపు, నెయ్యి కలిపి తీసుకుంటే ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది తింటే జీర్ణక్రియ, ఎముకల ఆరోగ్యం, కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లలు, వృద్ధులకు పసుపును నెయ్యిలో కలిపి ఉదయం పూట ఇస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
గర్భిణులు నార్మల్ డెలివరీ కావడానికి ప్రాధాన్యం ఇస్తారు. నెయ్యి తింటే నార్మల్ డెలివరీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చాలామంది అంటున్నారు. నెయ్యి తినడం ద్వారా లూబ్రికేషన్ పేరుకుపోతుందని, దీంతో ప్రసవం సులభంగా ఉంటుందంటారు. కానీ నిపుణులు మాత్రం ఇందులో వాస్తవం లేదంటున్నారు.
మడమల పగుళ్ల తగ్గాలంటే పడుకునే ముందు సాక్స్ ధరించాలని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోయే ముందు నెయ్యి లేదా ఏదైనా నూనెతో పాదాలు, అరికాళ్ళకు మసాజ్ చేయడం వల్ల పగుళ్లు పోవడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు.
కుక్కలు నెయ్యిని జీర్ణించుకోలేవు అనే మాట వినే ఉంటారు. అయితే ఇది నిజం కాదట. కుక్కలకు కొద్ది మొత్తంలో నెయ్యి తినిపించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని ఇప్పటి వరకు అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అయితే ఎక్కువగా నెయ్యి పెట్టకూడదు.