'గేమ్ ఛేంజర్' కు ప్రభుత్వం గుడ్ న్యూస్.. బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి
'గేమ్ ఛేంజర్' మూవీ టీమ్ కి ఏపీప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సినిమాకు సంబంధించి బెనిఫిట్ షోతో పాటూ టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600 పెంచింది. టికెట్ పై రూ.175, సింగిల్ స్కీన్లపై రూ.135 హైక్ ఇచ్చింది.