Game Changer vs Pushpa: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ కి ముందే వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. RRR తర్వాత దాదాపు 2 ఏళ్ళ గ్యాప్ తో చరణ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీంతో సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. విడుదలకు ముందే చరణ్ 256 ఫీట్ల కటౌట్ ఏర్పాటు చేసి సంబరాలు మొదలు పెట్టారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ కటౌట్ గురించే చర్చ నడుస్తోంది. సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ హీరోకు ఇంత పెద్ద కటౌట్ ఏర్పాటు చేయలేదు. అయితే ఈ భారీ కటౌట్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకొని రికార్డు క్రియేట్ చేసింది. దీంతో సినిమాకు దేశవ్యాప్తంగా విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. Also Read: 'పుష్ప2' ర్యాంపేజ్.. ఒక్కరోజులోనే పెరిగిన కలెక్షన్స్, ఎన్ని కోట్లంటే? పుష్ప VS గేమ్ ఛేంజర్ మరో వైపు నిర్మాత దిల్ కటౌట్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ ట్రైలర్ నా జేబులో ఉంది. ఇప్పుడు ట్రైలర్ లే సినిమా స్థాయిని నిర్మిస్తున్నాయి. అందుకే ఈ ట్రైలర్ ను కొత్త ఏడాది సందర్భంగా జనవరి 1న మీ ముందుకు తీసుకొస్తాము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ట్రైలర్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాము. ఈ ఈవెంట్ మాత్రం మామూలుగా ఉండకూడదు. చరిత్ర క్రియేట్ చేసేలా ఉండాలి.. ఈ సంక్రాంతిని గట్టిగా సెలెబ్రేట్ చేసుకునేందుకు చేసుకునేందుకు రెడీగా ఉండండి అని మరింత హైప్ క్రియేట్ చేశారు దిల్ రాజ్. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవు.. ఈ సంక్రాంతి గేమ్ ఛేంజర్ దే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ ముందు పుష్ప ఏ మాత్రం నిలబడలేదని.. పుష్పను బీట్ చేస్తుందని చర్చించుకుంటున్నారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి నటించారు. ఎస్.జె సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. Also Read: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు?