![ram charan game changer](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/01/04/TVmGpvyj9RDtrbF78hEh.jpg)
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి.\
#GameChanger 7 Shows on Day 1 including 1 AM Benefit Shows in AP🔥🔥
— Karthik RC ™ (@Its_me_charan1) January 4, 2025
Benefit Shows - 600/- pic.twitter.com/ZIkTj4DWrM
సినిమా కోసం మెగా ఫ్యాన్స్ తో ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో 'గేమ్ ఛేంజర్' మూవీ టీమ్ కి ఏపీప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సినిమాకు సంబంధించి బెనిఫిట్ షోతో పాటూ టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అర్థరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇచ్చింది.
అర్ధరాత్రి 1గంట ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600 పెంచింది. అలాగే మిగతా 5 షోలకు మల్టీప్లెక్సుల్లో టికెట్ పై రూ.175, సింగిల్ స్కీన్లపై రూ.135 హైక్ ఇచ్చింది. 23వ తేదీ వరకూ రోజుకు ఐదు షోలకు పెంచిన రేట్లతో టికెట్స్ విక్రయించుకోవచ్చని చెప్పింది. ఈ మేరకు శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : ఆరు సెంటర్లలో 100 రోజులు.. 'దేవర' సంచలన రికార్డ్