Breaking: బస్సులో చెలరేగిన మంటలు..ఇద్దరు ప్రయాణికులు సజీవదహనం..!!
జైపూర్ నుంచి ఢిల్లీకి వస్తున్న బస్సులో భారీ అగ్నిప్రమాదం, ఇద్దరు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. బస్సులో 35మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం.
జైపూర్ నుంచి ఢిల్లీకి వస్తున్న బస్సులో భారీ అగ్నిప్రమాదం, ఇద్దరు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. బస్సులో 35మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం.
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో పటల్కోట్ అనే ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పంజాబ్లోని ఫిర్జోపూర్ నుంచి మధ్యప్రదేశ్ వైపు వెళ్తున్న ఈ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం మేరకు సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశాయి. అయితే ఈ ఘటనలో 13 మందికి గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు.
నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం బాయ్స్ హాస్టల్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బొగ్గులకుంట కామినేని హాస్పిటల్ ముందు ఉన్న శ్రీనివాస హాస్టల్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
తమిళనాడులో మరోసారి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో 10 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మధ్య కాలంలో ఇలా పేలుడు సంభవించడం ఇది మూడో సారి.
సూరత్ లోని బాంబే మార్కెట్ (Bombay Market) అంటే తెలియని వారుండరు. ఈ మార్కెట్లో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది.
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు (JP Nadda)తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి ఆయన పూణె (Pune) లో ఓ వినాయక మండపాన్ని సందర్శించిన సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది.
గురుకుల పాఠశాలలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్పేట్ గురుకుల పాఠశాలలో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్య క్సేత్రం అయిన శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ లో అర్థరాత్రి సమయంలో ఎల్ బ్లాక్ సముదాయంలో ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 15 షాపులు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాద సమాచారం అందుకున్న దేవస్థానం అధికారులు వెంటనే.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని, ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంలో సుమారు రెండు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్య్కూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.