Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. 20 మంది మృతి దక్షిణ కొరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. By B Aravind 24 Jun 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి South Korea: దక్షిణ కొరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీలో (Lithium Battery Plant) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. సియోల్ దక్షిణ ప్రాంతంలోని హ్వసోంగ్‌లో ఉన్న లిథియం బ్యాటిరీ ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగింది. 35 వేల సెల్స్‌ను భద్రపరిచిన గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. Also Read: తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. మాతృత్వ సెలవులు పెంచిన కేంద్రం! ఈ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగేటప్పుడు 100 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. వీళ్లలో 78 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇప్పటివరకు 20 మృతదేహాలను అధికారులు గుర్తించారు. మిగిలిన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై స్పందించిన దక్షిణ కొరియ అధ్యక్షుడు యూన్‌సుక్ యోల్.. ప్రమాదాన్ని అదుపుచేయాలని ఆదేశించారు. ఇదిలాఉండగా.. ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు ఎక్కువగా దక్షిణ కొరియాలోనే తయారవుతాయి. అక్కడి నుంచే వాటిని ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కంపెనీలకు సరఫరా చేస్తుంటాయి. Also Read: ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం ఫ్రీ అడ్మిషన్లు.. ఆ జీవోను కొట్టేస్తూ హైకోర్టు సంచలన తీర్పు! #electric-vehicle #south-korea #fire-accident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి