కరీంనగర్ లో పుష్ప విలన్ డూప్..
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ పుట్టిన రోజు సందర్భంగా 'పుష్ప 2' మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పోస్టర్లో ఆయన గన్, గొడ్డలి చేతులతో పట్టుకుని క్రేజీ లుక్‌లో కనిపించారు. ఈ పోస్టర్ కాస్త సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.
ఫాహద్ ఫాజిల్ గత ఏడాది నటించిన 'ధూమం' ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతుంది. గతేడాది జూన్ 23 న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తెలుగు ఓటీటీ ఆహాలో జులై 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
నటుడు ఫహద్ ఫాసిల్ పై కేరళ మానవ హక్కుల సంఘం కేసు నమోదు చేసింది. ఇందుకు కారణం ఆయన లేటెస్ట్ మూవీ 'పింకేలీ'లోని కొన్ని సీన్స్ ఎర్నాకులంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో షూట్ చేశారు. ఎమర్జెన్సీ వార్డులో చేయడంతో రోగులు ఇబ్బందికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో కేసు నమోదు చేసినట్లు సమాచారం.
ఫహాద్ ఫాజిల్ రెమ్యునరేషన్ విషయంలో పుష్ప నిర్మాతలకు కొన్ని కండీషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. దాని ప్రకారం.. రోజుకి రూ.12 లక్షల్ని రెమ్యునరేషన్‌గా ఫిక్స్ చేశారట. ఒకవేళ షూటింగ్ రద్దయితే మరో రూ.2 లక్షలు అంటే మొత్తంగా రోజుకి రూ.14 లక్షలు ఇవ్వాలట.
రజినీకాంత్ 'కూలీ' సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది. ఈ మూవీలో మలయాళ హీరో ఫహాద్ ఫాసిల్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన రజినీకాంత్‌తో ‘వేట్టయ్యన్’ లో నటిస్తున్నాడు. దీంతో వీరిద్దరి కాంబో ’కూలీ’లో మళ్లీ రిపీట్ అవ్వనుంది.
ఫహాద్ ఫాజిల్ ADHD(అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్) అనే వ్యాధి బారిన పడ్డారట. ఈ వ్యాధి మెదడు పని తీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందట. ఈ వ్యాధి వల్ల ఏకాగ్రత లేకపోవడం, హైపర్ ఆక్టివ్, హైపర్ ఫోకస్ వంటి లక్షణాలు కనిపిస్తాయట.
మళయాలంలో 150 కోట్లుకొల్లగొట్టిన ఫహద్ ఫాజిల్ ఆవేశం మూవీ మే 9 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. అది కూడా మళయాళంతో పాటూ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుండటం విశేషం.
'పుష్ప' కంటే ముందు మలయాళ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా ఉన్న ఫాహద్ ఫాజిల్.. పుష్ప తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఫహద్ ఫాజిల్ మాత్రం పుష్ప వల్ల తనకు ఒరిగిందేమి లేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు .