Fahadh Faasil : ఏడాది తర్వాత ఓటీటీలోకి 'పుష్ప' విలన్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఫాహద్ ఫాజిల్ గత ఏడాది నటించిన 'ధూమం' ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతుంది. గతేడాది జూన్ 23 న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తెలుగు ఓటీటీ ఆహాలో జులై 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

New Update
Fahadh Faasil : ఏడాది తర్వాత ఓటీటీలోకి 'పుష్ప' విలన్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Fahadh Faasil Dhoomam Movie Coming On OTT : మలయాళ అగ్ర హీరో ఫాహద్ ఫాజిల్ (Fahadh Faasil) 'పుష్ప' సినిమాతోనే టాలీవుడ్ (Tollywood) కి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సినిమాలో భన్వర్ సింగ్ షికావత్ పాత్రలో తన నటనతో అదరగొట్టేసాడు. 'పుష్ప' కంటే ముందు మలయాళ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా ఉన్న ఫాహద్.. పుష్ప తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుసగా మలయాళ సినిమాలు చేస్తూనే ఇతర భాషల్లోనూ నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే గత ఏడాది ఈ హీరో నటించిన 'ధూమం' ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతుంది.

Also Read : హీరో రాజ్‌ తరుణ్‌ లవ్ కేసులో కొత్త ట్విస్ట్.. లావణ్యకు పోలీసులు బిగ్ షాక్?

ప్రభాస్ సలార్ సినిమాను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్‌ రూపొందించిన ఈ చిత్రం గతేడాది జూన్ 23 న విడుదలై సామాజిక సందేశంతో ఇవ్వడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. పవన్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఓటీటీ (OTT) వేదిక యాపిల్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. థియేటర్ లో రిలీజైన ఏడాది తర్వాత ఇప్పుడు తెలుగు ఓటీటీ ఆహా (Aha) లో జులై 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ 'ఆహా' పోస్టర్ పంచుకుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు