Pushpa 2: షెకావత్ పాత్రలో నేను చేయాల్సింది.. అసలు విషయం బయటపెట్టిన నారా రోహిత్ !

నారా రోహిత్ ఇటీవలే పాల్గొన్న ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. పుష్ప 2లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర కోసం ముందుగా తనను సంప్రదించారట. కానీ అది పాన్ ఇండియా సినిమా కావడంతో.. అన్ని భాషల్లో నటులు ఉండాలని ఆ పాత్రకు  ఫహద్ ని తీసుకున్నారని తెలిపారు.

New Update

Pushpa 2: దమ్ముంటే పట్టుకోరా షికావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్.. పుష్ప 2 లో ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో.. షెకావత్ పాత్ర కూడా అదే రేంజ్ లో హిట్ అయ్యింది. షెకావత్ పాత్రలో ఫహద్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోకు దీటుగా ఫహద్ మ్యానరిజం, డైలాగ్స్ మెప్పించాయి.

 భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర 

అయితే భన్వర్‌సింగ్  షెకావత్  పాత్ర కోసం మొదట నారా రోహిత్ ని సంప్రదించారట మేకర్స్. ఈ విషయాన్ని  ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో  నారా రోహిత్  స్వయంగా బయటపెట్టారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో షెకావత్ పాత్ర కోసం మీసాలతో ఉన్న ఓ లుక్ ఫొటో పంపించారు. ఆ తర్వాత దీని గురించి నిర్మాత, డైరెక్టర్ సుకుమార్ తో కూడా చర్చలు జరిపాము. అయితే ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో.. అన్ని భాషల్లో నటులు ఉండాలని ఆ పాత్రకు  ఫహద్ ని తీసుకున్నారని తెలిపారు. అలా రోహిత్ కి మంచి పాత్ర మిస్ అయ్యింది. ఒకవేళ రోహిత్  షెకావత్ పాత్ర  చేసుంటే అతడికి మంచి కమ్ బ్యాక్ గా ఉండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. 

నారా రోహిత్ ప్రస్తుతం భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించారు. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఈనెల 30న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రచార చిత్రాలు మంచి బజ్ క్రియేట్ చేశాయి.

telugu-news | cinema-news | telugu-cinema-news | pushpa-2 | fahadh-faasil | nara rohith

Advertisment
Advertisment
తాజా కథనాలు