Trump-Musk: మా అనుమతి లేకుండా మస్క్ ఏ పని చేయలేరు!
ట్రంప్ ప్రభుత్వాన్ని మస్క్ వెనుకుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో..మా అనుమతి లేకుండా మస్క్ ఏమీ చేయరు..చేయలేరు కూడా ..! అని ట్రంప్ అన్నారు.
ట్రంప్ ప్రభుత్వాన్ని మస్క్ వెనుకుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో..మా అనుమతి లేకుండా మస్క్ ఏమీ చేయరు..చేయలేరు కూడా ..! అని ట్రంప్ అన్నారు.
పని గంటల అంశంపై ఎలాన్ మస్క్ స్పందించారు. తమ డీవోజీఈ సిబ్బంది వారానికి 120 గంటలు పనిచేస్తున్నారని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కానీ అమెరికా ఉన్నతస్థాయి అధికారులు మాత్రం వారానికి కేవలం 40 గంటలు మాత్రమే పనిచేస్తున్నారన్నారు.
అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లను తీసుకురావడం బైడెన్ ప్రభుత్వం వల్లనే ఆలస్యం అయిందని అంటున్నారు ఎలాన్ మస్క్. కొత్త అధ్యక్షుడు ట్రంప్ మాత్రం వ్యోమగాములను తొందరగా తీసుకురావాలని చెప్పారని మస్క్ తెలిపారు.
ఎలన్ మస్క్ ఎక్స్ నుంచి Xmoney అనే డిజిటల్ వ్యాలెట్ సర్వీస్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు X సీఈఓ లిండా యాకారినో తెలిపారు. వినియోగదారులకు వీసా డైరెక్ట్ ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ పేమెంట్స్ చేసుకునే ఆప్షన్ తీసుకురానున్నట్లు ప్రకటించారు.
అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునితా విలియమ్స్ తాజాగా అక్కడి నుంచి విద్యార్థులతో మాట్లాడారు. జీరో గ్రావిటీలో నెలల తరబడి కూర్చోవడం, పడుకోవడం చాలా కష్టమని తెలిపారు. నడక ఎలా ఉంటుందో గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాని చెప్పారు.
ప్రపంచ నేతలతో అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కు విభేదాలు పెరుగుతున్నాయి. తాజాగా ఫ్రాన్స్ ప్రధాని ఫ్రాంకోయిస్ బేరో మస్క్ పై తీవ్ర విమర్శలు చేశారు.మస్క్ తీరు ప్రజాస్వామ్యానికి ముప్పుగా ఆయన పేర్కొన్నారు.
ప్రపంచంలో ఏ మూలనా, ఎక్కడున్నా సెల్‌ఫోన్‌కు సిగ్నల్స్ అందించేందుకు స్టార్‌లింక్ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన బీటా టెస్టింగ్ జనవరి 27న ప్రారంభం కానుంది. ఇది సక్సెస్ అయితే ప్రపంచంలో ఎక్కడా కూడా సిగ్నల్స్ సమస్య ఉండదు.