Telangana: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. త్వరలో యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు !
రేవంత్ ప్రభుత్వం మరో హామీ అమలు దిశగా ముందుకెళ్తోంది. త్వరలో ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేయనున్నట్లు తెలుస్తోంది. 18 ఏళ్లు పైబడిన యువతుల కోసం ఈ పథకం అమలు చేసేందుకు విధివిధానాలను రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం.