Electric Scooter: మీ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ తగ్గిపోతోందా? అయితే ఈ చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టండి..

ఇప్పటికే చాలా రకాల ఇ-స్కూటర్స్, ఇ-కార్లు మార్కెట్‌లోకి అడుగుపెట్టాయి. అయితే ఇ-స్కూటర్స్‌ వినియోగదారుల నుంచి కొన్ని సమస్యలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఎక్కువ రేంజ్ రావడం లేదని, బ్యాటరీ పవర్ త్వరగా ఖాళీ అవుతోందని చెబుతున్నారు.అయితే ఈ సింపుల్ చిట్కాలతో వాటిికి చెక్ పెట్టేయండి!

New Update
Electric Scooter: మీ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ తగ్గిపోతోందా? అయితే ఈ  చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టండి..

Tips to Increase Electric Scooter Range: భారతదేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరుగుతోంది. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఎలక్ట్రిక్‌ వాహనాల ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దాదాపు అన్ని దిగ్గజ ఆటో కంపెనీలు ఈవీ ప్రొడక్టులను లాంచ్‌ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా రకాల ఇ-స్కూటర్స్, ఇ-కార్లు మార్కెట్‌లోకి అడుగుపెట్టాయి. అయితే ఇ-స్కూటర్స్‌ వినియోగదారుల నుంచి కొన్ని సమస్యలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఎక్కువ రేంజ్ రావడం లేదని, బ్యాటరీ పవర్ త్వరగా ఖాళీ అవుతోందని చెబుతున్నారు. మీరూ ఇదే సమస్య ఎదుర్కుంటున్నారా? అయితే ఇ-స్కూటర్లతో ఎక్కువ రేంజ్‌ అందించే కొన్ని టిప్స్ తెలుసుకుందాం పదండి.

* ఎలక్ట్రానిక్స్‌‌ను ఆఫ్ చేయడం

ఇ-స్కూటర్లు కస్టమర్లను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడు బ్లూటూత్, స్మార్ట్ నావిగేషన్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో వస్తుంటాయి. రైడింగ్ సమయంలో మెరుగైన రేంజ్ కోసం బ్యాటరీ పవర్‌ను ఆదా చేయడానికి ఈ ఎలక్ట్రానిక్స్ ఫీచర్స్‌ను ఆఫ్ చేయాలి. పగటిపూట ప్రయాణిస్తున్నప్పుడు LED డేటైమ్ రన్నింగ్ లైట్స్, హెడ్‌ల్యాంప్‌లను స్విచ్ఛాఫ్ చేయాలి.

* బ్యాటరీ మెయింటెనెన్స్‌

ఈవీ బ్యాటరీని సరిగా మెయింటైన్‌ చేయడం వల్ల వాహనం రేంజ్ పెరగనప్పటికీ, మ్యాక్సిమం రేంజ్ తగ్గకుండా చూసుకోవచ్చు. ఎలక్ట్రిక్ స్కూటర్లు లిథియం-అయాన్ బ్యాటరీలతో వస్తాయి. ఇవి దాదాపుగా 300-500 ఛార్జ్ సైకిల్స్ లేదా రెండు, మూడు సంవత్సరాల జీవితకాలంతో ఉంటాయి. బ్యాటరీ ఎక్కువకాలం మన్నికగా రావాలంటే 15 శాతం కంటే తక్కువ ఛార్జ్ రాకముందే రీఛార్జ్ చేయాలి. లిథియం-అయాన్ బ్యాటరీలు 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఉత్తమ పనితీరును అందిస్తాయి. అందుకే వాటిని అధిక ఉష్ణోగ్రతలకు ఎక్స్‌ఫోజ్ చేయకూడదు. అధిక ఉష్ణోగ్రతలు బ్యాటరీ జీవిత కాలాన్ని తగ్గిస్తాయి. తక్కువ ఎనర్జీని స్టోర్‌ చేయడానికి దారితీస్తాయి.

* టైర్ ప్రెజర్

ఇ-స్కూటర్లకు కంపెనీ సిఫార్సు చేసిన టైర్ ప్రెజర్‌ను ఎల్లప్పుడూ మెయింటైన్‌ చేయాలి. ఇది వాహనంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. టైర్‌లో ఎయిర్ ప్రెజర్ అనేది సరైన స్థాయిలో ఉంటే రోలింగ్ నిరోధకత తగ్గుతుంది. ఇది మోటార్ ఎనర్జీని తక్కువగా ఉత్పత్తి చేయడంతో పాటు తక్కువగా వినియోగిస్తుంది. బ్యాటరీ పవర్ ఆదా అవుతుంది. ఫలితంగా ఇ-స్కూటర్ రేంజ్ మరింత పెరుగుతుంది.

* థొరెటల్ అండ్ బ్రేక్‌

బ్యాటరీ పవర్ ఆదా కావాలంటే నెమ్మదిగా, పవర్ సేవింగ్ మోడ్‌లో రైడ్ చేయాలి. పవర్-సేవింగ్ మోడ్‌లో నెమ్మదిగా రైడ్ చేస్తే బ్యాటరీ ఛార్జ్ పెరుగుతుంది. ఫలితంగా స్కూటర్‌ ఎక్కువ రేంజ్‌ను అందిస్తుంది. రైడింగ్ స్టైల్‌ని ఆప్టిమైజ్ చేయడంలో ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అవకాశం ఉన్నప్పుడు స్పీడ్‌గా వెళ్లడం, స్పీడ్ బ్రేకర్స్ వద్ద బ్రేక్స్ వేస్తూ రైడ్ చేయాలి. యాక్సిలరేటర్, బ్రేక్‌లను స్మూత్‌గా డీల్ చేయాలి.

* బ్యాటరీ అప్‌గ్రేడేషన్

ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఉన్న ప్రస్తుత బ్యాటరీ అవసరాలను తీర్చకపోతే అది క్షీణించిందని అర్థం. వెంటనే పెద్ద బ్యాటరీకి అప్‌గ్రేడ్ చేయాలి. ఫలితంగా ఇ-స్కూటర్ మెరుగైన రేంజ్‌ను అందిస్తుంది. స్కూటర్ అనుకూలంగా ఉంటే అధిక-వోల్టేజ్ బ్యాటరీని అమర్చుకోవచ్చు. బ్యాటరీ ఛార్జీని కూడా పరిశీలించాలి. Ah ఎంత ఎక్కువగా ఉంటే, బ్యాటరీ ఎక్కువ ఛార్జ్‌ని నిల్వ చేస్తుంది. మరొక ప్రత్యామ్నాయంగా రెండో బ్యాటరీని ఇన్‌స్టాల్ చేయడం. దీంతో ఇ-స్కూటర్‌కు డబుల్ పవర్ లభిస్తుంది. అయితే ఇది స్కూటర్ బరువును పెంచుతుంది. ఛార్జ్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.

* వెయిట్ మానిటర్

ఇంజిన్‌తో నడిచే వాహనాల మాదిరిగానే, ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు కూడా బరువు పరిమితులు ఉంటాయి. బరువైన వస్తువులు, ఎక్కువ మంది ప్రయాణీకులతో స్కూటర్‌ను ఓవర్‌లోడ్ చేయకూడదు. ఇది స్కూటర్ రేంజ్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు