Ap Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త..ఈ వారం అంతా వానలే వానలు..!
ఏపీ వాతావరణ శాఖ చల్ల చల్లని వార్త వినిపించింది.సోమవారం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీ వాతావరణ శాఖ చల్ల చల్లని వార్త వినిపించింది.సోమవారం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీ ఏలూరులో వివాహితపై గ్యాంగ్ రేప్ కలకలం రేపుతోంది. ఉండికి చెందిన మహిళను లైంగిక కోరిక తీర్చాలని లేదంటే భర్తను చంపేస్తామంటూ రవి, సోము మరికొంతమంది రేప్ చేశారు. నగ్న వీడియోలు తీసి డబ్బుకోసం బ్లాక్ మెయిల్ చేయగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఉమెన్స్ డే రోజే ఏపీలో ఘోరం జరిగింది. ముమ్మిడివరం అనాతవరంలో మాలతి అనే పక్కింటి మహిళపై జయ రామకృష్ణ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. పిల్లల గొడవలే ఇందుకు కారణం కాగా మాలతి తల లోతుగా తెగింది. ఆమెను అస్పత్రికి తరలించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రాజమహేంద్రవరంలో గోదావరి నదిలో పడవ మునిగిన ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. 20 మంది పడవలో లంకకు వెళ్లారు. వారిలో కొందరు తిరిగి వస్తుండగా పడవ అదుపుతప్పి బోల్తా పడింది. పడవలోకి నీరు చేరడం వల్లే ఘటన జరిగినట్టు తెలిసింది.
తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్‌ఫ్లూతో చనిపోతున్న కోళ్ల సంఖ్య పెరుగుతోంది. దీంతో నెల రోజుల పాటు చికెన్ తినవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాజమండ్రి కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూంలో 9542908025 నెంబర్ ఏర్పాటు చేశారు.
తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. బూరుగుపూడి గేట్ దగ్గర ఉన్న అద్భుత రెసిడెన్సీలో రేవ్ పార్టీ జరుగుతుందని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని 5 గురు యువతులు, 12 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.
ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నికలు డిసెంబర్ 5న జరగనున్నాయి. ఈ క్రమంలో 48 గంటల పాటు వైన్ షాప్‌లు మూసివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి డిసెంబర్ 5 సాయంత్రం 4 గంటల వరకు మూసివేయాలని ఆదేశించారు.