తెలంగాణలో మరోసారి భూకంపం.. భయంతో పరుగులు
తెలంగాణలో మరోసారి భూప్రకంపనలు వచ్చాయి. మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం దాసరిపల్లి సమీపంలో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా జనాలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. అదే సమయంలో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.0గా నమోదైంది.